Iran Oil Tanker Attack | చమురు ట్యాంకర్‌పై ఇరాన్ క్షిపణి దాడి.. హర్మూజ్‌లో మళ్లీ ఉద్రిక్తతలు

చమురు ట్యాంకర్‌పై ఇరాన్ క్షిపణులతో దాడులు చేయడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో హర్మూజ్ ప్రాంతంలో మరోసారి ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Iran Oil Tanker Attack | హర్మూజ్ జలసంధి (Strait of Hormuz)లో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి. జల సంధిలో చమురు ట్యాంకర్‌పై ఇరాన్ క్షిపణి దాడి చేయడంతో నౌకలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఇరాన్ దాడుల్లో పక్కనే ఉన్న మరో చమురు నౌక కూడా స్వల్పంగా దెబ్బతిన్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే దాడికి గురైన ట్యాంకర్లు ఏ దేశానికి చెందినవి, వాటిలో ఉన్న సిబ్బంది పరిస్థితి ఏమిటన్న విషయమై స్పష్టత రాలేదు.

Iran Oil Tanker Attack | చర్చల వేళ దాడులు..

హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకల విషయమై అమెరికా, ఒమన్ మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ సమయంలో ఇరాన్ జరిపిన క్షిపణి దాడులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. హర్మూజ్ మీదుగా నౌకా రవాణా ఇప్పటికే తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న నేపథ్యంలో తాజా దాడి ఆందోళనలను మరింత పెంచింది.

Iran Oil Tanker Attack | హూతీల దాడి ఎటు దారితీస్తుందో..

మరోవైపు సౌదీ అరేబియా -హూతీల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. అరామ్‌కోకు చెందిన జాజన్ రిఫైనరీపైనా హూతీలు క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడ్డారు. ఈ ఘటన కారణంగా చమురుశుద్ధి కేంద్రం వద్ద భారీగా మంటలు చెలరేగాయి. దీంతో రిఫైనరీని తాత్కాలికంగా మూసివేశారు. ఇక సౌదీ సైనికులే లక్ష్యంగా ఓడరేవుపై జరిపిన దాడుల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఇటీవల సౌదీ అరేబియా, పాకిస్థాన్, తుర్కియే ‘మక్కా ఒప్పందం’ కుదుర్చుకున్న విషయం తెలిసిందే. దీని ప్రకారం ఏ ఒక్కదానిపై దాడి జరిగినా.. దాన్ని మిగిలిన రెండు దేశాలపైనా దాడిగా పరిగణించి కలిసికట్టుగా స్పందిస్తారు. ఈ డీల్ కుదుర్చుకున్న కొన్ని రోజుల్లోనే హూతీలు సౌదీపై దాడులు చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఈ మÖడు దేశాలు ఎలా స్పందిస్తాయోనన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది.

ఇది కూడా చదవండి..: Indian Stock Markets | స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్లు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *