అక్షరటుడే వెబ్డెస్క్: Gautam Adani Case | అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీపై అమెరికా కోర్టులో కొనసాగుతున్న క్రిమినల్ ఆరోపణలు తొలగిపోయాయి. మోసం, లంచం వంటి తీవ్రమైన అభియోగాలకు సంబంధించి దాదాపు రెండేళ్లుగా సాగుతున్న విచారణను న్యాయస్థానం ముగిస్తూ ఆ కేసును కొట్టివేసింది. అయితే, ఈ కేసును ఉపసంహరించుకోవాలన్న న్యాయ శాఖ నిర్ణయంపై కోర్టు కొంత ఆందోళన వ్యక్తం చేసింది. మిగతా నిందితులపై అభియోగాలను పూర్తిగా ఎత్తివేయాలా వద్దా అనే అంశంపై స్పష్టత కోసం మరిన్ని వివరాలు సమర్పించాలని న్యాయ శాఖను ఆదేశించింది. అమెరికా డిస్ట్రిక్ట్ కోర్టు తీసుకున్న ఈ నిర్ణయాన్ని గౌతమ్ అదానీ స్వాగతించారు. న్యాయవ్యవస్థపై తనకు ఉన్న నమ్మకమే చివరకు గెలిచిందని ఆయన పేర్కొన్నారు.
Gautam Adani Case | ఆరోపణల నేపథ్యం ఇదే..
భారతదేశంలో సౌర విద్యుత్ సరఫరా ఒప్పందాలు దక్కించుకోవడం కోసం స్థానిక అధికారులకు సుమారు 250 మిలియన్ డాలర్ల వరకు లంచాలు చెల్లించారనేది అదానీపై ఉన్న ప్రధాన అభియోగం. అమెరికా మార్కెట్ల నుంచి పెట్టుబడులు సేకరించే సమయంలో ఈ లంచాల వ్యవహారాన్ని దాచిపెట్టి, ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న కాలంలో (2024లో) అదానీతో పాటు మరో ఏడుగురిపై ఈ కేసులు నమోదయ్యాయి. తాజా పరిణామంలో భాగంగా ఈ అభియోగాలను ఉపసంహరించుకోవాలని అమెరికా న్యాయ శాఖ కోరడంతో కోర్టు ఈ నిర్ణయం వెలువరించింది.
I welcome the US court’s decision with humility and deep respect for the judicial process.
Throughout this challenging period, our faith in truth, fairness and the rule of law remained unwavering.
My deepest gratitude to those who never lost faith in us, in the system and in…
— Gautam Adani (@gautam_adani) August 10, 2026
ఇది కూడా చదవండి: Manmohan Singh Case | మన్మోహన్ సింగ్కు క్లీన్ చిట్ చారిత్రాత్మకం: సోనియా గాంధీ