అక్షరటుడే, వెబ్‌డెస్క్ : IAS Couple | ఆ ఇద్దరు దంపతులు ఐఏఎస్ (IAS) అధికారులు. ఇప్పుడు పక్క పక్క జిల్లాలకు కలెక్టర్లుగా కొనసాగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన విషయం తెలిసిందే.
నిర్మల్ కలెక్టర్‌గా ఉన్న అభిలాషను ట్రాన్స్ఫర్ చేసింది. ఆ స్థానంలో భవేష్ మిశ్రా (Bhavesh Mishra)ను నియమించింది. ఆదివారం కలెక్టరేట్‌లోని తన కార్యాలయంలో భవేష్ మిశ్రా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన తన భార్య, నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి (Ila Tripathi)తో కలిసి బాసర జ్ఞాన సరస్వతి ఆలయాన్ని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. భార్యాభర్తలు ఇద్దరు కలెక్టర్లు కావడం.. పక్క పక్క జిల్లాల్లో పోస్టింగ్ పొందడం గమనార్హం.

IAS Couple | 2015 బ్యాచ్ ఐఏఎస్
భవేశ్ మిశ్రా గతంలో మైన్స్, జియోలాజీ డైరెక్టర్‌గా కొనసాగారు. ఆయన 2015 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ఇలా త్రిపాఠి 2017 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఆమె గతంలో నల్గొండ కలెక్టర్‌గా పని చేశారు. కొన్ని నెలల క్రితం బదిలీపై నిజామాబాద్‌కు వచ్చారు.
ఇది కూడా చదవండి : Telangana Rain Alert | తెలంగాణలో మళ్లీ వర్షాలు..


[…] ఇది కూడా చదవండి : IAS Couple | భార్యాభర్తలు.. పక్క పక్క జిల్లాల … […]