Census Handbook Nizamabad | జనగణన హ్యాండ్‌బుక్ రూపకల్పనకు సమాచారం అందించాలి: కలెక్టర్ భవేష్ మిశ్రా

జిల్లా జనగణన హ్యాండ్‌బుక్ రూపకల్పన కోసం ఖచ్చితమైన సమాచారం అందించాలని కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులకు దిశానిర్దేశం చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ : Census Handbook Nizamabad | జిల్లా (Nizamabad) జనగణన హ్యాండ్‌బుక్ రూపకల్పన కోసం ఖచ్చితత్వంతో కూడిన నాణ్యమైన సమాచారం అందించాలని కలెక్టర్ భవేష్ మిశ్రా (Collector Bhavesh Mishra) అధికారులకు దిశానిర్దేశం చేశారు. కలెక్టరేట్​లో మంగళవారం వివిధ శాఖల అధికారులతో ఆయన మాట్లాడారు.

Census Handbook Nizamabad | విద్యావైద్యం

విద్యా, వైద్య సదుపాయాలు, తాగునీరు, పారిశుధ్యం, రవాణా, సమాచార వ్యవస్థ, బ్యాంకింగ్, రుణ సదుపాయాలు, విద్యుత్, ఇంధన వనరులు తదితర విషయాలపై ఖచ్చితమైన సమాచారం అందించాలని కలెక్టర్​ సూచించారు. జిల్లా జనగణన హ్యాండ్‌బుక్ రాబోయే పదేళ్ల పాటు సమాచార సేకరణ, ప్రణాళికల రూపకల్పనకు ఎంతో ఉపయుక్తమైన గ్రంథంగా నిలుస్తుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని సమాచార సేకరణలో ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. వారం రోజుల్లో సంబంధిత శాఖలు సమాచారాన్ని సేకరించి అందించాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ భుజంగరావు, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఇన్​ఛార్జి సీపీవో కిషన్  పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Smart Ration Cards | రేషన్​కార్డులపై కీలక అప్​డేట్​.. 1.06 కోట్ల స్మార్ట్​కార్డులు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *