అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Pocharam Srinivas Reddy | బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరినా నిధులు ఇవ్వడం లేదన్నారు.
బీఆర్ఎస్ (BRS) నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పోచారం అనంతరం కాంగ్రెస్ గూటికి చేరిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం ఆయనను ప్రభుత్వ సలహాదారుగా సైతం నియమించింది. అయితే మంగళవారం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కేసీఆర్ (KCR) వల్లే అభివృద్ది జరిగింది అని చెప్పారు. తాను కొన్ని రాజకీయ పరిణామాల వల్ల పార్టీ మారాల్సి వచ్చిందన్నారు. నిధులు కావాలని రేవంత్ రెడ్డి తమ్ముడి దగ్గరికి తన కుమారుడిని పంపితే.. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు రూపాయి కూడా నిధులు ఇవ్వమని చెప్పి పంపించారన్నారు. దీంతో కొన్ని రోజుల తర్వాత తప్పక పార్టీ మారాల్సి వచ్చిందని తెలిపారు.
Pocharam Srinivas Reddy | మంత్రులు ఫోన్ లేపడం లేదు
బాన్సువాడ (Banswada) నియోజకవర్గం అభివృద్ధి కోసం తాను సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కండూవా కప్పుకున్నానని పోచారం తెలిపారు. అయినా నిధులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లకు బిల్లులు రాకపోవడంతో పనులు ఆపేశారన్నారు. నిధుల కోసం సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)ని కలిస్తే.. మంజూరు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటికి తన ముందే చెప్పారన్నారు. మరుసటి రోజు వారికి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి మాటలు మంత్రులు లెక్క చేయడం లేదన్నారు. ఆరు నెలల్లో బాన్సువాడ నియోజకవర్గంలో ఉన్న పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరిస్తామని సీఎం చెబితేనే కండువా కప్పుకున్నానని తెలిపారు.
Pocharam Srinivas Reddy | 50 సార్లు ఫోన్ చేశా
మంత్రులకు చెప్పినా నిధులు ఇవ్వలేదని మళ్లీ సీఎంను కలిశానని పోచారం చెప్పారు. ఈ సారి వేం నరేందర్‌రెడ్డిని పిలిచి నిధులు విడుదల అయ్యేలా చూడాలని ఆయన చెప్పారన్నారు. తర్వాత రోజు వేం నరేందర్ రెడ్డి సైతం ఫోన్ లేపలేదని పేర్కొన్నారు. 50 సార్లు ఫోన్ చేసినా ఫోన్ అటెండ్ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీనిని కూడా చదవండి : Smart Ration Cards | రేషన్‌కార్డులపై కీలక అప్డేట్.. 1.06 కోట్ల స్మార్ట్‌కార్డులు