Mumbai Landslide | ముంబైలో విరిగిపడిన కొండచరియలు.. ఇద్దరు దుర్మరణం..

ముంబైలోని ఘట్‌కోపర్‌లో కొండచరియలు విరిగిపడి ఇళ్లు కూలిపోయి ఇద్దరు మృతి చెందారు.

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Mumbai Landslide | ముంబైలోని ఘట్‌కోపర్‌లో కొండచరియలు విరిగిపడి ఇళ్లు కూలిపోయి ఇద్దరు మృతి చెందారు. కాగా.. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు. దీంతో సహాయక రంగంలోకి దిగి వారిని రక్షించేందుకు చర్యలు చేపట్టారు.

Mumbai Landslide | ఘట్‌కోపర్-కుర్లా రోడ్డులో..

ముంబైలోని ఘట్‌కోపర్-కుర్లా రోడ్డు వెంబడి, రాథోడ్ మెడికల్ సమీపంలోని చిరాగ్ నగర్‌లోని గౌషియా చాల్ ప్రాంతంలో భారీ వర్షాల మధ్య తెల్లవారుజామున 3:48 గంటల ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఇప్పటివరకు రెండు మృతదేహాలను వెలికితీసి సమీప ఆసుపత్రికి పంపారు. శిథిలాల కింద ఇంకా చిక్కుకుని ఉండవచ్చని భావిస్తున్న వారిని గుర్తించి.. సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

Mumbai Landslide | భారీ వర్షాల కురువడంతో..

భారీ వర్షాల కారణంగా అశోక్ నగర్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయని డీసీపీ గణేష్ షిండే తెలిపారు. రెండు మృతదేహాలను వెలికితీసినట్లు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. పోలీసు సిబ్బందితో పాటు BMC, NDRF మరియు ఇతర ఏజెన్సీల సిబ్బంది సహాయక పనులు చేస్తున్నారని చెప్పారు. కాగా.. వర్షాకాలానికి ముందే ఆ ప్రాంతంలోని అనేక ఇళ్లకు నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి..: Sangareddy Road Accident | ఘోర ప్రమాదాలు.. తొమ్మిది మంది దుర్మరణం

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *