Arvind Divyang Welfare | దివ్యాంగుల సంక్షేమంపై దృష్టిపెట్టాలి: ఎంపీ అర్వింద్

దివ్యాంగుల సంక్షేమంపై దృష్టిపెట్టాలని ఎంపీ అర్వింద్ అన్నారు. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి డాక్టర్​ వీరేంద్ర కుమార్‌ను న్యూఢిల్లీలో బుధవారం కలిశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Arvind Divyang Welfare | దివ్యాంగుల సంక్షేమంపై దృష్టిపెట్టాలని ఎంపీ అర్వింద్ (MP Arvind) అన్నారు. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి డాక్టర్​ వీరేంద్ర కుమార్‌ను న్యూఢిల్లీలో బుధవారం కలిశారు.

Arvind Divyang Welfare | నియోజకవర్గంలో దివ్యాంగుల కోసం..

నియోజకవర్గంలోని దివ్యాంగుల సంక్షేమం, సాధికారతపై చేపట్టాల్సిన చర్యలపై వారిరువురు చర్చించారు. దివ్యాంగుల సమస్యలు, సంక్షేమ పథకాలు, సహాయక పరికరాల పంపిణీ, ప్రభుత్వ సేవల సులభతపై ఎంపీ కేంద్రమంత్రికి వివరించారు. వీల్‌చైర్లు, వినికిడి పరికరాలు, కృత్రిమ అవయవాల కోసం అంచనా శిబిరాలు విస్తరించాలని కోరారు. విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు పెంచడంతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ప్రజా ప్రదేశాల్లో అందుబాటు సౌకర్యాలు మెరుగుపర్చాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలో కేంద్ర పథకాలు అర్హులందరికీ చేరేలా పనిచేస్తున్నామని ఎంపీ తెలిపారు. సహకారానికి కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీ విజ్ఞప్తులపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందిస్తూ దివ్యాంగుల సంక్షేమానికి అవసరమైన పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: Geetha Workers Bus Yatra | ఆగస్టు 2 నుంచి గీతన్నల చైతన్య బస్సుయాత్ర

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *