అక్షరటుడే, వెబ్‌డెస్క్ : RI Caught by ACB | రాష్ట్రంలో అవినీతి అధికారులు రెచ్చిపోతున్నారు. తమ వద్దకు పనుల కోసం వచ్చే ప్రజలను లంచాల పేరిట వేధిస్తున్నారు. ఏసీబీ అధికారులు దాడులు (ACB Raids) చేస్తున్నా.. లంచాలకు మరిగిన అధికారులు భయపడటం లేదు. తాజాగా ఓ రెవెన్యూ ఇన్స్పెక్టర్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు.
జగిత్యాల జిల్లా బీర్పూర్ (Birpoor RI) మండలంలో మంచికట్ల రాహుల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్నాడు. ఓ వ్యక్తికి సంబంధించిన భూమికి సర్వే నిర్వహించి, రిజిస్ట్రేషన్, పట్టాదారు పాస్‌బుక్ జారీ కోసం నివేదిక ఇవ్వడం ఆర్ఐ రూ.50 వేల లంచం డిమాండ్ చేశాడు. బాధితుడు బతిమిలాడటంతో దానిని రూ.40 వేలకు తగ్గించాడు. దీంతో ఆ వ్యక్తి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో గురువారం ఆర్ఐ రాహుల్ ఫిర్యాదుదారుడి ఇంట్లో రూ.30 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం కార్యాలయంలో సోదాలు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేశారు.
RI Caught by ACB | లంచం ఇవ్వొద్దు
ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగితే ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచించారు. ఎంత మొత్తం అడిగినా తమకు ఫిర్యాదు చేయాలన్నారు. డబ్బులు డిమాండ్ చేస్తే టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫోన్ చేయాలన్నారు. ఏసీబీ వెబ్సైట్ ద్వారా కూడా ఫిర్యాదు చేయొచ్చన్నారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
దీనిని కూడా చదవండి : Telangana SIR conspiracy | ఎస్ఐఆర్ పేరుతో తెలంగాణపై కుట్రలు జరుగుతున్నాయి: సీఎం రేవంత్ రెడ్డి