అక్షరటుడే, కామారెడ్డి : Two Cars Collide | ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు బలంగా ఢీకొన్నాయి. ఈ ఘటన సదాశివనగర్ మండలం భూంపల్లి శివారులో శనివారం చోటుచేసుకుంది.
Two Cars Collide | పద్మాజీవాడి ఎక్స్ రోడ్ వద్ద..
పద్మాజీవాడి ఎక్స్ రోడ్ నుంచి గాంధారి వైపు వెళ్తున్న కారు, గాంధారి నుంచి కామారెడ్డి (Kamareddy) వైపు వస్తున్న మరొక కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ క్రమంలో రెండు కార్లు రోడ్డు పక్కన ఉన్న ఇనుప స్తంభాన్ని ఢీకొన్నాయి. ప్రమాద సమయంలో రెండు కార్లలో ఇద్దరు చొప్పున మొత్తం నలుగురు ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, ఒకరికి కాలు విరిగింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కామారెడ్డి జీజీహెచ్ కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇది కూడా చదవండి..: Free School Shoes | 145 మంది విద్యార్థులకు ఉచితంగా స్కూల్ షూస్ పంపిణీ