అక్షరటుడే, వెబ్డెస్క్ : Suryapet Bus Accident | సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆకుపాముల వద్ద శనివారం అర్ధరాత్రి రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు.
శ్రీకృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (Travels Bus) నర్సాపూర్ నుంచి హైదరాబాద్ వెళ్తుంది. ఏలూరు నుంచి హైదరాబాద్ (Hyderabad) వెళ్తున్న ఏపీఎస్ఆర్టీసీ బస్సు.. ఆ ట్రావెల్స్ బస్సును వెనుక నుంచి ఢీకొంది. ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. ఆ సమయంలో రెండు బస్సుల్లో కలిపి 63 మంది ప్రయాణికులు ఉన్నాయి. ట్రావెల్స్ బస్సును ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొనడంతో ఆర్టీసీ బస్సు డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. సుమారు రెండు గంటల పాటు శ్రమించి డ్రైవర్ను పోలీసులు బయటకు తీశారు. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
Suryapet Bus Accident | కాలువలోకి దూసుకెళ్లిన కారు
పశ్చిమగోదావరి (West Godavari) జిల్లా ఇరగవరం మండలం అయితంపూడి వద్ద ఆదివారం తెల్లవారుజామున ఓ కారు కాలువలోకి దూసుకెళ్లింది. నరసాపురం స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులు స్నేహితుని సోదరుడి పెళ్లికి తూర్పుగోదావరి జిల్లా వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో నలుగురు విద్యార్థులు గల్లంతు కాగా, మట్ట సంతోష్ అనే విద్యార్థి ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు చేరారు. మరో ముగ్గురు నాగబత్తుల సూర్య, నాగిరెడ్డి బన్ను, సంతోష్, చరణ్ గల్లంతు అయ్యారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
దీనిని కూడా చదవండి : Indonesia Earthquake | ఇండోనేషియాలో భారీ భూకంపం.. 230కి పైగా ప్రకంపనలు.. 47 మంది దుర్మరణం