Ponnam Prabhakar Caste Census | కులగణన పేరుతో కేంద్రం మోసం.. ప్రధాని మోదీకి పొన్నం లేఖ

దేశవ్యాప్త కులగణన విషయంలో కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తోందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా విమర్శించారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Ponnam Prabhakar Caste Census | దేశవ్యాప్త కులగణన విషయంలో కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తోందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా విమర్శించారు. జనగణనలో కులగణన చేస్తామని గతంలో ప్రకటించిన నరేంద్ర మోదీ  ( Narendra Modi )సర్కార్.. లెక్కల సేకరణకు వచ్చేసరికి వెనకడుగు వేసిందని ఆరోపించారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన ఆదివారం ( ఆగస్టు 16 ) లేఖ రాశారు.

Ponnam Prabhakar Caste Census | ప్రత్యేక కేటగిరీకి డిమాండ్..

2027 జనాభా లెక్కల్లో ఓబీసీ/ఎస్ఈబీసీ (సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్‌వర్డ్ క్లాసెస్) లకు ప్రత్యేక కేటగిరీ ఏర్పాటు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తన లేఖలో డిమాండ్ చేశారు. జనాభా లెక్కల్లో ఓబీసీల జనాభాను శాస్త్రీయంగా, పారదర్శకంగా నమోదు చేసేలా ప్రత్యేక కేటగిరీని చేర్చాలని, ఎస్సీ, ఎస్టీలతో పాటు ఓబీసీలకు ప్రత్యేక కేటగిరీ, రాష్ట్రాల వారీగా మాస్టర్ కుల డైరెక్టరీ, కులాలకు ప్రత్యేక డిజిటల్ కోడ్‌లు కేటాయించాలని కోరారు. అలాగే 2011 ఎస్‌ఈసీసీలో ఎదురైన కులాల పేర్లు, స్పెల్లింగ్‌లు, ఉపకులాల సమస్యలు పునరావృతం కాకుండా ప్రమాణీకృత విధానం అవలంబించాలని, తెలంగాణలో నిర్వహించిన సర్వే అనుభవాలను 2027 జనాభా లెక్కల రూపకల్పనలో పరిగణనలోకి తీసుకోవాలని ఆయన సూచించారు.

Ponnam Prabhakar Caste Census | కేంద్ర వైఖరిపై ఆగ్రహం..

ఇవాళ గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడిన పొన్నం ప్రభాకర్.. కేంద్రం విడుదల చేసిన జనగణన ప్రశ్నావళిలో బీసీల ప్రస్తావనే లేదని మండిపడ్డారు. 40 ప్రశ్నలతో కూడిన జనగణన పత్రంలో కేవలం ఎస్సీ, ఎస్టీల ప్రస్తావన మాత్రమే ఉందని మండిపడ్డారు. తాను బీసీనని చెప్పుకునే ప్రధాని మోదీ.. బీసీల సంక్షేమం కోసం ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఒత్తిడి వల్లే దేశవ్యాప్తంగా కులగణనకు కేంద్రం దిగివచ్చిందని, కానీ లెక్కల సేకరణలో మాత్రం మోసం చేస్తోందని విమర్శించారు. కేంద్రం ఇచ్చిన సర్క్యులర్‌ను సవరించి, దేశంలో బీసీల జనాభా ఎంత ఉందో తేల్చేలా ప్రత్యేక ప్రశ్నను చేర్చాలని కోరారు.

బీసీలకు ఇంత జరుగుతున్నా.. బీసీ వర్గానికి చెందిన కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించకపోవడం బాధాకరమన్నారు. బండి సంజయ్ ఇతర విషయాలు పక్కన పెట్టి, ముందుగా బీసీల హక్కుల గురించి మాట్లాడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ హితవు పలికారు.

ఇది కూడా చదవండి:  TG SAFE | ‘తెలంగాణ సేఫ్’​ కమిషనర్​గా అవినాష్​ మొహంతి

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *