అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Medical Student Suicide | ఉప్పల్ పోలీస్ స్టేషన్ (Uppal Police) పరిధిలో విషాదం చోటు చేసుకుంది. ఉస్మానియాలో వైద్య విద్య చదువుతున్న కె భరద్వాజ్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
రామంతపూర్‌కు చెందిన భరద్వాజ్ (18) ఉస్మానియా మెడికల్ కాలేజీ (Osmania Mecal College)లో ఎంబీబీఎస్ ఫస్టియర్ చదువుతున్నాడు. పీఎస్ కాలనీలో నివాసం ఉంటున్న అతడు శనివారం అర్ధరాత్రి 1.30 గంటల వరకు తన సోదరితో కలిసి చదువుకున్నాడు. అనంతరం అందరు నిద్ర పోతుండగా బయటకు వెళ్లాడు. తెల్లవారుజామున 3:20 గంటలకు భరద్వాజ్ ఇంట్లో కనిపించలేదు. దీంతో ఆంఓదళనకు గురైనా కుటుంబ సభ్యులు స్నేహితులు, బంధువులకు ఫోన్ చేశారు. పరిసర ప్రాంతాల్లో గాలించారు. అయినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Medical Student Suicide | నిర్మాణంలో ఉన్న భవనం వద్ద..
ఆదివారం ఉదయం 8:30 గంటలకు ఎన్ఎస్ఎల్ నిర్మాణంలో ఉన్న భవనం నుంచి ఓ యువకుడు కిందపడినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించగా మృతి చెందిన వ్యక్తి భరద్వాజ్‌గా గుర్తించారు. అయితే అర్ధరాత్రి అతడు అక్కడికి ఎందుకు వెళ్లాడనే విషయాలు తెలియరాలేదు. ఆ సమయంలో ఒక్కడే ఉన్నాడా.. మరెవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి సోదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
దీనిని కూడా చదవండి : Karnataka CM DK Shivakumar | ఏ సంస్థ అయినా చట్టాన్ని పాటించాల్సిందే : కర్ణాటక సీఎం