అక్షరటుడే, మెండోరా: SRSP Water Storage | ఎస్సారెస్పీకి ప్రాజెక్టుకు వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. మహారాష్ట్రతో పాటు ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గడంతో ప్రాజెక్టులోకి వచ్చే ఇన్ఫ్లో కూడా తగ్గినట్లు అధికారులు తెలిపారు.
SRSP Water Storage | 1,013 క్యూసెక్కుల ఇన్ఫ్లో
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ (Sriramsagar Project) పూర్తిస్థాయి నీటిమట్టం 1,091 అడుగులు (80.50 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 1,079.60 అడుగుల (43.967 టీఎంసీల) నీరు నిల్వ ఉంది. గత ఏడాది ఇదే సమయానికి 59.766 టీఎంసీల నీటి నిల్వ ఉండగా, ప్రస్తుతం సుమారు 15.8 టీఎంసీల మేర తక్కువగా ఉన్నట్లు లెక్కలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం జలాశయంలోకి 1,013 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. కాకతీయ కాలువ ద్వారా 300 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 482 క్యూసెక్కులు కలిపి మొత్తం 1,013 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తోంది.
ఇది కూడా చదవండి..: Jajala Surender Arrest | మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ హౌస్ అరెస్ట్..