అక్షరటుడే, వెబ్డెస్క్: Nagababu Cabinet Rank | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సోదరుడు, ఎమ్మెల్సీ నాగబాబుకు ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పించింది. ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Nagababu Cabinet Rank | ఛైర్మన్గా నాగబాబు
రాష్ట్రంలో పచ్చదనం, అటవీ విస్తీర్ణం పెంపు, పర్యావరణాన్ని పరిరక్షించే లక్ష్యంతో పని ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ పని చేస్తుంది. దీని ఛైర్మన్గా నాగబాబును ప్రభుత్వం నియమించింది. ఈ బాధ్యతలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ ర్యాంకు హోదాను ఇచ్చింది. కాగా జనసేన నాయకుడు నాగబాబును మంత్రి చేస్తారని గతంలో ప్రచారం జరిగింది. ఈ మేరకు ఆయనను ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. అయితే తాజాగా ప్రభుత్వం కేబినెట్ హోదా ఉన్న పదవి ఇవ్వడంతో మంత్రి పదవి ఇచ్చే అవకాశం లేదని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..: ACB Trap Employee | ACB Trapలో ఉద్యోగి పట్టుబడితే వెంటనే ఉద్యోగం పోతుందా? నిబంధనలు ఏం చెబుతున్నాయి?