భీమ్గల్(వేల్పూర్), అక్షరటుడే: Kalyana Lakshmi Scheme | కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ఎప్పటిలాగే కొనసాగించాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. వేల్పూర్ మండల తహశీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు.
Kalyana Lakshmi Scheme | పేదింటి ఆడబిడ్డలకు ఆర్థిక భరోసా..
ధర్నా కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొని ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) మాట్లాడుతూ.. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉన్నతమైన లక్ష్యంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాలను తీసుకొచ్చారని గుర్తుచేశారు. అయితే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కళ్యాణలక్ష్మి చెక్కుతో పాటు తులం బంగారం ఇస్తామని ఆశచూపి ఓట్లు వేయించుకుందని, తీరా అధికారంలోకి వచ్చాక ఆ హామీని నీరుగార్చిందని మండిపడ్డారు.
అంతేకాకుండా కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కూడా రద్దు చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆయన ఆరోపించారు. పేదల సంక్షేమానికి సంబంధించిన ఈ పథకాలను ఎలాంటి కోతలు లేకుండా కొనసాగించాలని, ఇచ్చిన హామీ ప్రకారం తులం బంగారం అందించాలని డిమాండ్ చేశారు. పేదల హక్కుల సాధన కోసం, సంక్షేమ పథకాల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి..: CMR Rice Scam | ఒక్కొక్కటిగా బయటికొస్తున్న సీఎంఆర్ బాగోతాలు.. మరో రైస్మిల్లో ధాన్యం గల్లంతు..