Kodandaram Azharuddin Oath | శాసనమండలి సభ్యులుగా కోదండరాం, అజారుద్దీన్ ప్రమాణం

Srinivas Kolluri

అక్షరటుడే, హైదరాబాద్: Kodandaram Azharuddin Oath | తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎంపికైన ప్రొఫెసర్ కోదండరాం, మహమ్మద్ అజారుద్దీన్ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. శాసనమండలి ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutta Sukhender Reddy) వారితో పదవీ ప్రమాణం చేయించారు.

Kodandaram Azharuddin Oath | ముఖ్య అతిథులు

ఈ వేడుకకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్వయంగా హాజరయ్యారు. ఆయనతో పాటు రాష్ట్ర మంత్రివర్గంలోని పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొని కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలకు శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్ కోటా కింద వీరిద్దరినీ ఎమ్మెల్సీలుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం (State Government) నిన్ననే (ఆదివారం) అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

Kodandaram Azharuddin Oath | గెజిట్ నోటిఫికేషన్‌

గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా (Governor Shiv Pratap Shukla) ఆదేశాల మేరకు సాధారణ పరిపాలన శాఖ ఈ నియామకాలకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసిన కొద్ది గంటల్లోనే ప్రమాణస్వీకార కార్యక్రమం జరగడం విశేషం. తెలంగాణ ఉద్యమకారుడిగా కోదండరాం, క్రీడా, రాజకీయ రంగ ప్రముఖుడిగా అజారుద్దీన్ మండలిలో అడుగుపెట్టడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

ఇది కూడా చదవండి..: BRS Formation Day | కేసీఆర్​ను​ మళ్లీ సీఎంను చేసే వరకు పోరాడుతాం : కేటీఆర్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *