అక్షరటుడే, వెబ్‌డెస్క్: Indian Stock Market | పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలతో ముడిచమురు ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. బ్యారెల్‌కు 91 డాలర్లు దాటడంతో మార్కెట్‌ను ద్రవ్యోల్బణ భయాలు వెన్నాడుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకే మొగ్గుచూపుతుండడంతో దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా ఆరో సెషన్‌లోనూ నష్టాలతో కొనసాగుతోంది. ఐటీ సెక్టార్‌తోపాటు హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ వంటి దిగ్గజ బ్యాంకులు ప్రధాన సూచీలను కిందికి లాగుతున్నాయి.
Indian Stock Market | గ్యాప్ డౌన్‌లో ప్రారంభం..
దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) సోమవారం ఉదయం గ్యాప్ డౌన్‌లో ప్రారంభమైంది. సెన్సెక్స్ 310 పాయింట్ల నష్టంతో ప్రారంభమైనా వెంటనే కోలుకుని 157 పాయింట్లు పైకి ఎగబాకింది. అక్కడినుంచి 296 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ 64 పాయింట్ల నష్టంతో ప్రారంభమై 46 పాయింట్లు పెరిగినా నిలదొక్కుకోలేకపోయింది. ఇంట్రాడే గరిష్టాలనుంచి 95 పాయింట్లు నష్టపోయింది. ఉదయం 11.40 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 386 పాయింట్ల నష్టంతో 77,341 వద్ద, నిఫ్టీ 93 పాయింట్ల నష్టంతో 24,194 వద్ద ఉన్నాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 8 స్టాక్స్ లాభాలతో, 22 స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఎంఅండ్ ఎం 0.85 శాతం, ట్రెంట్ 0.71 శాతం, యాక్సిస్ బ్యాంక్ 0.53 శాతం, పవర్‌గ్రిడ్ 0.32 శాతం, బజాజ్ ఫైనాన్స్ 0.32 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : హెచ్సీఎల్ టెక్ 2.07 శాతం, ఇన్ఫోసిస్ 2 శాతం, ఆసియన్ పెయింట్ 1.89 శాతం, అదానీ పోర్ట్స్ 1.56 శాతం, ఇండిగో 1.55 శాతం నష్టాలతో ఉన్నాయి.
ఇది కూడా చదవండి..: Milky Mist IPO | మిల్కీ మిస్ట్.. లిస్టింగ్ అదుర్స్.. తొలిరోజే 29.64 శాతం లాభాలు