Pocharam Srinivas Reddy | పోచారం మాకొద్దు.. బాన్సువాడ కాంగ్రెస్​ నాయకుల నినాదాలు

నగరంలో బాన్సువాడ కాంగ్రెస్​ నాయకులు హల్​చల్​ చేశారు. పోచారం శ్రీనివాస్​రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్​ చేయాలని డిమాండ్​ చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Pocharam Srinivas Reddy | నగరంలో బాన్సువాడ కాంగ్రెస్​ నాయకులు హల్​చల్​ చేశారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని పార్టీ సస్పెండ్​ చేయాలని డిమాండ్​ చేస్తూ రోడ్డుపై భైఠాయించారు.

Pocharam Srinivas Reddy | దుబ్బలోని ఎంకే గార్డెన్​ వద్ద..

నిజామాబాద్​ (Nizamabad) నగరంలోని దుబ్బప్రాంతంలోని ఎంకే గార్డెన్​లో పొలిటికల్​ ఎఫైర్స్​ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పీసీసీ చీఫ్​ బొమ్మ మహేష్​కుమార్​ గౌడ్​, ఉమ్మడి జిల్లా ఇన్​ఛార్జి, మంత్రి సీతక్క హాజరయ్యారు. అయితే ఈ సమావేశానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్​రెడ్డి వర్గం కాంగ్రెస్​ నాయకులు గార్డెన్​ ఎదుట బైఠాయించారు. పోచారం శ్రీనివాస్​ రెడ్డి తమకు అవసరం లేదని నినదించారు. వెంటనే ఆయనను పార్టీ నుంచి సస్పెండ్​ చేయాలని నినాదాలు చేశారు. బాన్సువాడలో పోచారం తీరుతో కాంగ్రెస్​ పార్టీతో తీవ్ర నష్టం ఏర్పడుతోందన్నారు. ఆయన నిర్ణయాల కారణంగా సీనియర్​ కాంగ్రెస్​ నాయకులకు అన్యాయం జరుగుతోందన్నారు. వెంటనే ఆయనను పార్టీ నుంచి తొలగించాలని పేర్కొంటూ ధర్నాకు దిగారు.

Pocharam Srinivas Reddy

ఇది కూడా చదవండి..: Nizamabad Forest Conservation | అటవీ సంరక్షణకు సమన్వయంతో పనిచేయాలి: కలక్టర్​ భవేష్​ మిశ్రా

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *