అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Movie Ticket Prices | తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా టికెట్ రేట్లపై కొత్తగా జీవో జారీ చేసింది. కొత్తగా స్పెషల్ థియేటర్స్ కేటగిరి ఏర్పాటు చేసింది. 7.1, 2K/4K స్క్రీన్లకు స్పెషల్ కేటగిరిగా పేర్కింది.
ప్రతి థియేటర్లో 25 శాతం సీట్లు నాన్ ప్రీమియం కేటాయించాలని ఆదేశించింది. ఉదయం 8 నుంచి రాత్రి 1 వరకు 5 షోలకు అనుమతి ఇచ్చింది. అంతేగాకుండా చిన్న సినిమాలను ప్రోత్సహంచేలా నిర్ణయం తీసుకుంది. చి న్న సినిమాలకు రోజూ ఒక షో తప్పనిసరి అని స్పష్టం చేసింది. రూ.100 కోట్లు పైబడిన సినిమాలకు సూపర్ హైబడ్జెట్ హోదా కల్పించింది.
Movie Ticket Prices | కొత్త ధరలు ఇలా..
నాన్ ఏసీ థియేటర్లలో నాన్ ప్రీమియంలో టికెట్ ధర కనిష్ఠంగా రూ.30, గరిష్ఠంగా రూ.70, ప్రీమియంలో కనిష్ఠంగా రూ.50, గరిష్ఠంగా రూ.100 ఉండాలని ప్రభుత్వం పేర్కొంది. ఏసీ థియేటర్లలో నాన్ ప్రీమియంలో కనిష్ఠంగా రూ.50, గరిష్ఠంగా రూ.150, ప్రీమియంలో కనిష్ఠంగా రూ.100, గరిష్ఠంగా రూ.200. స్పెషల్ థియేటర్లలో నాన్ ప్రీమియంలో కనిష్ఠంగా రూ.100, గరిష్ఠంగా రూ.250 ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రీమియంలో రూ.200 నుంచి రూ.300గా నిర్ణయించింది. మల్టీప్లెక్స్‌లో రెగ్యులర్ టికెట్ ధరలు రూ.100 నుంచి రూ.250, రిక్లైనర్ రేటు రూ.200 నుంచి రూ.300 మధ్య ఉండాలని స్పష్టం చేసింది.
Movie Ticket Prices | 20 శాతం కార్మికుల సంక్షేమానికి..
టికెట్ ధరల పెంపు ద్వారా వచ్చిన కలెక్షన్లో 20 శాతం కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (TGFDC)కు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. పెద్ది, రాజాసాబ్, మనశంకర వరప్రసాద్ గారు, అఖండ 2 సినిమాల టికెట్ ధరల పెంపుతో వచ్చిన కలెక్షన్లో 20 శాతం TGFDC ఖాతాల్లో జమ చేయాలని పేర్కొంది. ఆ మొత్తాన్ని ఎగ్జిబిటర్ల నుంచి వసూలు చేయాలని నిర్మాతలకు సూచించింది.
ప్రత్యేక థియేటర్లను గుర్తించడానికి జిల్లాల కలెక్టర్/పోలీస్ కమిషనర్‌ను నోడల్ అధికారిగా నియమించి ఒక జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నారు. సూపర్ హై బడ్జెట్ చిత్రాలు అసాధారణంగా అధిక నిర్మాణ విలువలను కలిగి ఉండాలి. ఇందులో అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్, కంప్యూటర్-జనరేటెడ్ ఇమేజరీ, అధునాతన చిత్రీకరణ, ప్రదర్శన సాంకేతికత, భారీ స్థాయి సెట్లు, యాక్షన్ సీక్వెన్స్‌లు, పాన్-ఇండియా, జాతీయ ఖ్యాతి గల నటులు ఉండాలి.
దీనిని కూడా చదవండి : Ponguleti Voter Deletion | బీజేపీ కుట్రలను తిప్పికొడతాం : మంత్రి పొంగులేటి