నిజామాబాద్Collectorate Parking Fire | కలెక్టరేట్ పార్కింగ్​లో మంటలు..

Collectorate Parking Fire | కలెక్టరేట్ పార్కింగ్​లో మంటలు..

కామారెడ్డి కలెక్టరేట్​లో పార్కింగ్​లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజన్​తో మంటలను ఆర్పివేశారు.

అక్షరటుడే, కామారెడ్డి: Collectorate Parking Fire | కామారెడ్డి కలెక్టరేట్​ (Kamareddy Collectorate)లో వాహనాలకు రక్షణ లేకుండా పోతోంది. రూ.కోట్లు ఖర్చుచేసి నిర్మించిన భవంతిలో పార్కింగ్​ ప్రణాళిక లేకపోవడంతో వాహనాలు ఎండకు ఎండి.. వానకు తడుస్తున్నాయి.

Collectorate Parking Fire | సరైన పార్కింగ్​ సౌకర్యం లేక..

సరైన పార్కింగ్ లేక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అసలే ఎండాకాలం.. పైగా రోజు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కలెక్టరేట్​కు వచ్చే ఉద్యోగులు, సాధారణ ప్రజల వాహనాల పార్కింగ్​కు అనువైన స్థలం ఉన్నా రక్షణ లేకుండా పోతుంది. ఐదు నిమిషాలు కూడా ఎండలో నిలబడలేని పరిస్థితుల్లో ఓపెన్ పార్కింగ్ స్థలంలో వాహనాలను నిలపాలంటే భయపడుతున్నారు. ద్విచక్రవాహనాలు అక్కడక్కడా చెట్లకింద పార్కింగ్ చేస్తున్నా కార్ల పార్కింగ్ సమస్యగా మారింది. ఎండలోనే కార్లను పార్కింగ్ చేయాల్సిన దుస్థితి నెలకొంది.

Collectorate Parking Fire | ఒక్కసారిగా మంటలు..

సోమవారం కలెక్టర్ కార్యాలయం పార్కింగ్ (Collector’s Office Parking)​లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దాంతో కలెక్టరేట్​కు వచ్చిన ప్రజలు, ఉద్యోగులు కాసేపు ఏం జరుగుతుందో అర్థం కాక ఆందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేసి సమాచారం అందించగా ఫైర్ ఇంజన్​తో సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. సకాలంలో స్పందించకపోయి ఉంటే పెనుప్రమాదం సంభవించేదని ప్రజలు చెబుతున్నారు.. మంటలు దట్టంగా వ్యాపించి ఉంటే పక్కనే ఉన్న కార్లు మంటల్లో కాలిపోయేవి.

అప్రమత్తమైన కలెక్టరేట్ సిబ్బంది ఉద్యోగులకు చెప్పడంతో కార్లను అక్కడినుంచి తీసివేశారు. అయితే కలెక్టరేట్ వెనకాల కార్ల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాటు చేశారు. అయితే అక్కడ పైన షెడ్ లాంటిది ఏమి లేకపోవడంతో చెట్టుకింద నీడ చూసి అక్కడ పార్కింగ్ చేస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి పార్కింగ్ కోసం ప్రత్యేకంగా షెడ్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

ఇది కూడా చదవండి..: RMP Welfare Association | పీఎంపీ, ఆర్​ఎంపీ వెల్ఫేర్​ అసోసియేషన్​ జిల్లా మహిళా కార్యవర్గం

 

Balla Sandeep Kumar
Balla Sandeep Kumarhttps://aksharatodaynews.com/
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Bellamkonda Wedding | రుమలలో ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వివాహం.. కావ్య రెడ్డితో కొత్త జీవితానికి శ్రీకారం

అక్షరటుడే, వెబ్​డెస్క్: Bellamkonda Wedding | తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక...

April 30 Gold Rates | మ‌రింత త‌గ్గుతున్న బంగారం ధ‌ర‌.. కొనుగోలుదారులకు ఊరట!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: April 30 Gold Rates | అంతర్జాతీయ మార్కెట్‌లో...

April 30 Horoscope | సమాజంలో పెరగనున్న కీర్తి ప్రతిష్ఠలు.. ఈ రాశుల వారి వ్యక్తిత్వానికి ఫిదా అవ్వాల్సిందే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: April 30 Horoscope | ఇవాళ గ్రహ గతులను బట్టి...

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...