అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: NSUI Leaders Suspension | జిల్లా (Nizamabad)లో ఎన్ఎస్యూఐ నాయకులపై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేస్తున్నట్లు డీసీసీ కార్పొరేషన్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు.
NSUI Leaders Suspension | కిసాన్ న్యాయ్ సత్యాగ్రహ కార్యక్రమంలో..
ఎన్ఎస్యూఐ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి వరదబట్టు వేణురాజ్, 48వ డివిజన్ మాజీ అధ్యక్షుడు వుండ్ర సాయికిరణ్, ఎన్ఎస్యూఐ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి నరేన్ దీప్లపై సస్పెన్షన్ ఉత్తర్వుల రద్దు చేస్తూ ప్రాథమిక సభ్యత్వాన్ని తిరిగి పునరుద్ధరిస్తున్నట్లు రామకృష్ణ తెలిపారు. కిసాన్ న్యాయ్ సత్యాగ్రహ కార్యక్రమంలో జరిగిన క్రమశిక్షణా రాహిత్యం కారణంగా ఏప్రిల్ 8న ఈ ముగ్గురిపై సస్పెన్షన్ విధించామని ఆయన పేర్కొన్నారు.
అనతరం విషయాన్ని పునఃపరిశీలించి, సమగ్రంగా చర్చించిన అనంతరం, సస్పెన్షన్, ప్రాథమిక సభ్యత్వ రద్దు ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నిర్ణయించిందన్నారు. పైన పేర్కొన్న ముగ్గురు నాయకులతో పార్టీ నాయకులు లేదా కార్యకర్తలు సంబంధాలు కలిగి ఉండకూడదనే నిబంధనలు పూర్తిగా రద్దు చేయబడ్డాయని పేర్కొన్నారు. సదరు నాయకులు ఇకపై పార్టీ క్రమశిక్షణను కాపాడుతూ, ఏఐసీసీ, అధిష్టానం సూచనలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు.
ఇది కూడా చదవండి..: Private Teachers Safety | ప్రైవేట్ ఉపాధ్యాయులకు రక్షణ కల్పించాలి : ట్రస్మా వినతి