Unauthorized Clinics Nizamabad | అనుమతుల్లేని క్లినిక్​లపై వైద్యశాఖ దాడులు

జిల్లావ్యాప్తంగా అనుమతుల్లేని క్లినిక్​లు, ఆస్పత్రులపై వైద్యశాఖ వరుస దాడులు చేస్తోంది.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Unauthorized Clinics Nizamabad | జిల్లావ్యాప్తంగా అనుమతుల్లేని క్లినిక్​లు, ఆస్పత్రులపై వైద్యశాఖ వరుస దాడులకు పాల్పడుతోంది. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటికి తాళం వేస్తోంది.

Unauthorized Clinics Nizamabad | నగరంలోని ఖలీల్​వాడిలో..

నగరం (Nizamabad)లోని ఖలీల్​వాడిలో శనివారం డీఎంహెచ్​వో రాజశ్రీ ఆధ్వర్యంలో వైద్యాధికారులు దాడులు నిర్వహించారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ల్యాబ్, క్లినిక్​, ఆస్పత్రుల్లో తనిఖీలు నిర్వహించారు. ఖలీల్​వాడీలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి క్లినిక్​లో తనిఖీ చేసిన అధికారులు నిబంధనలుకు విరుద్ధంగా నిర్వహిస్తుండడంతో తాళం​ వేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్​వో మాట్లాడుతూ.. జిల్లాలో అనుమతులేని ఆస్పత్రులు, క్లినిక్​లలో వైద్యం కారణంగా అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ప్రత్యేక డ్రైవ్ చేపట్టి వాటిని మూసివేస్తున్నామని తెలిపారు.

ఇది కూడా చదవండి..: Telangana Tirumala Temple | శ్రీవారి కొండకు పోటెత్తిన భక్తజనం..పూజలు చేసిన ఎమ్మెల్యే పోచారం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *