అక్షరటుడే, ఆర్మూర్ : Jhanda Balaji Jatara | పట్టణంలో (Armoor) జెండా బాలాజీ జాతరను ఆదివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అశేషంగా తరలివచ్చారు.
Jhanda Balaji Jatara | ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పూజలు..
ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి (MLA Paidi Rakesh Reddy) కుటుంబ సభ్యులతో కలిసి జెండాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా ఆర్మూర్ మున్సిపల్ ఛైర్పర్సన్ గోనెలహరి రఘు, ఈఆర్ ఫౌండేషన్ ఛైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ జెండాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సాయంత్రం డప్పు వాయిద్యాల నడుమ జెండాను అంకాపూర్ గ్రామస్తులకు అందజేశారు. అంకాపూర్‌లో 20 రోజుల పాటు పూజలు అందుకున్న జెండా అటు నుంచి జక్రాన్‌పల్లి మండలం అర్గుల్, సిర్నపల్లి గ్రామాల మీదుగా చివరికి తిరుమలకు చేరుకుంటుంది.
ఇది కూడా చదవండి: Warehouse Fire | హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. గోదాములో చెలరేగిన మంటలు