Gas Cylinder Auto | గ్యాస్​సిలిండర్​ ఆటో బోల్తా.. తప్పిన ప్రమాదం

గ్యాస్​ సిలిండర్లు తరలిస్తున్న ఆటో ప్రమాదవశాత్తు బోల్తా పడింది.

shashi kiran Mottala

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Gas Cylinder Auto | వర్షం పడుతున్న వేళ గ్యాస్​ సిలిండర్లు తరలిస్తున్న ఓ ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. మెదక్​–నర్సాపూర్​ రోడ్డుపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

మెదక్​–నర్సాపూర్​ రోడ్డుపై..

మెదక్ (Medak)‌‌‌‌– నర్సాపూర్ రోడ్డుపై చింతకుంట సమీపంలో గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. వర్షం పడుతుండటంతో ఆటో అదుపుతప్పినట్లు స్థానికులు తెలిపారు. ఆటోలో ఉన్న సిలిండర్లు రోడ్డుపై పడిపోయాయి. ఆ సమయంలో ఎలాంటి వాహనాలు రాకపోకలు లేకపోవడం వల్ల భారీప్రమాదం తప్పిందని, డ్రైవర్​కు సైతం ఎలాంటి గాయాలు కాలేదని స్థానికులు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి..: Chain Snatching | బస్టాండ్​లో చైన్​స్నాచింగ్.. ఇద్దరు మహిళల నగలు మాయం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *