అక్షరటుడే, ఇందూరు: Governor Nizamabad Visit | రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా (Governor Shiv Pratap Shukla) మంగళవారం నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను కలెక్టర్ భవేష్ మిశ్రా, సీపీ సాయిచైతన్య పర్యవేక్షించారు.
Governor Nizamabad Visit | క్షేత్రస్థాయిలో ఏర్పాట్ల పరిశీలన
గవర్నర్ పర్యటన నేపథ్యంలో కలెక్టర్ భవేష్ మిశ్రా, పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య సోమవారం క్షేత్రస్థాయిలో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. గవర్నర్ పర్యటించనున్న ప్రతిచోటా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్, సీపీలు సమావేశమై గవర్నర్ పర్యటన ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. ప్రొటోకాల్‌ను పాటిస్తూ గవర్నర్ పర్యటనకు ఎక్కడ కూడా ఏ దశలోనూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికాబద్దంగా వ్యవహరించాలని సూచించారు.
Governor Nizamabad Visit | విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలి
విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని, మెడికల్ టీం, 108, 104, ప్రత్యేక డాక్టర్ల బృందంను అందుబాటులో ఉంచాలని, వేదిక, సీటింగ్‌ను సరి చూసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. తాగునీరు, శానిటేషన్ పక్కాగా ఉండాలని సంబంధిత అధికారులకు బాధ్యతలు పురమాయించారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ, గవర్నర్ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత ఉంటుందని, ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. అనుమతి ఉన్న వారు మాత్రమే గవర్నర్ కార్యక్రమాలకు హాజరు కావాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ భుజంగరావు, ట్రైనీ కలెక్టర్ సురేష్, డీఆర్వో గీత, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, డీఆర్డీవో సాయన్న, ఆర్డీవో రాజేంద్రకుమార్, ట్రైనీ ఆర్డీవో సందీప్ పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: యూట్యూబ్ కు చైనా నుంచి పోటీ యాప్