అక్షరటుడే, వెబ్డెస్క్ : Assembly Sessions | శాసనసభ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. బ్రిటన్ పర్యటనను విజయవంతంగా ముగించుకుని తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి అందుబాటులో ఉన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో సచివాలయంలో సమావేశమయ్యారు.
Assembly Sessions | భూ సేకరణ చేపట్టాలి
ప్రజాప్రతినిధులందరూ నియోజకవర్గాల అభివృద్ధిపై ఫోకస్ పెంచాలని సీఎం సూచించారు. ప్రధానంగా నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ భూసేకరణ పనులు వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూ సేకరణపై నిర్లక్ష్యం వహిస్తే ప్రాజెక్టులు ఎప్పటికీ పూర్తి కావన్నారు. భూసేకరణ, ఆర్అండ్ఆర్ (R&R), అటవీ అనుమతులకు సంబంధించి నిధులను వెంటనే మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.
ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka), మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, రామచంద్ర నాయక్, బీర్ల ఐలయ్య, వేముల వీరేశం పాల్గొన్నారు.
దీనిని కూడా చదవండి : ACB Raid | రూ.లక్ష లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన ట్యాక్స్ ఆఫీసర్