Arvind Surveillance Allegations | ఎంపీ అర్వింద్ నిఘా వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన డీజీపీ సీవీ ఆనంద్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడి ఆదేశాలతో తనపై పోలీసులు నిఘా పెట్టారంటూ నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ చేసిన ఆరోపణలను డీజీపీ సీవీ ఆనంద్ పూర్తిగా తోసిపుచ్చారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Arvind Surveillance Allegations | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడి ఆదేశాలతో తనపై పోలీసులు నిఘా పెట్టారంటూ నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ( Dharmapuri Arvind )చేసిన ఆరోపణలను డీజీపీ సీవీ ఆనంద్ పూర్తిగా తోసిపుచ్చారు. ఎంపీ అర్వింద్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా చేసిన పోస్ట్‌పై డీజీపీ వెంటనే స్పందించారు. సంబంధిత అధికారులతో సమగ్రంగా విచారించి వాస్తవాలను నిర్ధారించుకున్నామని, ఎంపీని అనుసరించడానికి గానీ, ఆయనపై నిఘా ఉంచడానికి గానీ ఏ అధికారినీ నియమించలేదని స్పష్టం చేశారు.

Arvind Surveillance Allegations | విధులకు కట్టుబడి ఉన్నాం..

తెలంగాణ పోలీస్ శాఖ ఎన్నడూ ఇలాంటి నిఘా పద్ధతులను అనుసరించదని, కేవలం రాజ్యాంగబద్ధమైన విధులకు మాత్రమే కట్టుబడి ఉంటుందని డీజీపీ పేర్కొన్నారు. అయినప్పటికీ ఈ వ్యవహారానికి సంబంధించి ఎంపీ వద్ద ఏవైనా అదనపు ఆధారాలు లేదా కచ్చితమైన సమాచారం ఉంటే, వాటిని నేరుగా తనకు వ్యక్తిగతంగా అందజేయవచ్చని తెలిపారు. అటువంటి ఆధారాలపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని డీజీపీ భరోసా ఇచ్చారు. ఈ వివరణతో ఎంపీ వర్సెస్ పోలీస్ నిఘా వ్యవహారంపై జరుగుతున్న రాజకీయ దుమారానికి తెరదించే ప్రయత్నం చేశారు.

ఇది కూడా చదవండి:  Indian Students US | అమెరికాలో తగ్గిన భారతీయ విద్యార్థుల దరఖాస్తులు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *