అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Turmeric Farmers Honoured | నగరంలోని పసుపుబోర్డు కార్యాలయాన్ని గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా (Governor Shiv Pratap Shukla) సందర్శించారు. జాతీయ, రాష్ట్ర గేయాలపన అనంతరం, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
Turmeric Farmers Honoured | పసుపు రైతులతో భేటీ..
ఈ సందర్భంగా పసుపు బోర్డు కార్యాలయంలో నిర్వహిస్తున్న కార్యకలాపాలను గవర్నర్కు జాతీయ పసుపు బోర్డు కార్యదర్శి భవానీశ్రీ వివరించారు. అనంతరం పసుపు రైతుల సమక్షంలో ‘సునహరీ మట్టి అభియాన్’ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా ప్రారంభించారు. అనంతరం ఆదర్శ రైతులను సన్మానించి, జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, పైడి రాకేష్ రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన కిషోర్, కలెక్టర్ భవేష్ మిశ్రా, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, పసుపు బోర్డు ఛైర్మన్ పి.గంగారెడ్డి, సెక్రెటరీ ఎన్.భవానీశ్రీ, డిప్యూటీ డైరెక్టర్ ప్రత్యూష్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Nasha Mukt Bharat | ‘నషా ముక్త్ భారత్’ కోసం యువత కృషి చేయాలి: గవర్నర్ శివ్ ప్రతాష్ శుక్లా