అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Konda Murali | మంత్రి కొండా సురేఖ (Konda Surekha) భర్త కొండా మురళి కీలక వ్యాఖ్యలు చేశారు. తాము కాంగ్రెస్ పార్టీని వీడేది లేదన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ (Rahul Gandhi) అంటే తమకు గౌరవం అని చెప్పారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka)తో కొండా మురళి బుధవారం భేటీ అయ్యారు. ఈ భేటీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం హాజరు అయ్యారు. కొండా సుష్మిత వ్యాఖ్యలపై అధిష్టానం సీరియస్‌గా ఉండటంతో మురళి డిప్యూటీ సీఎంతో చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సుష్మిత వివాదంతో తనకు సంబంధం లేదని మురళి అన్నారు. తాను వరంగల్ వెళ్లలేదని చెప్పారు. తన కూతురు ప్లాన్‌కు తనకు ఎలా తెలుస్తుందని ఆయన ప్రశ్నించారు.
Konda Murali | మాకు ఆ హక్కు లేదు
సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం అని కొండా మురళి స్పష్టం చేశారు. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని చెప్పారు. సుస్మితను ప్రశ్నించే హక్కు తమకు లేదన్నారు. తాను కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని తెలిపారు. బీఆర్‌ఎస్ నుంచి కవిత బయటకు రాలేదా అన్నారు. తన బిడ్డకు స్వతంత్రంగా మాట్లాడే హక్కుందని మురళి పేర్కొన్నారు. ఓ బిల్లు విషయంలో భట్టి విక్రమార్కను కలిసినట్లు చెప్పారు.
దీనిని కూడా చదవండి : Nepal Flash Floods | నేపాల్‌లో భీకర వరదలు.. వేయి మందికి పైగా గల్లంతు!