Banswada Road Accident | ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొని యువకుడు మృతి

ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొని యువకుడు మృతి చెందాడు.

shashi kiran Mottala

అక్షరటుడే, బాన్సువాడ: Banswada Road Accident | ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొని యువకుడు మృతి చెందాడు. బాన్సువాడ–కొత్తబాది ప్రధాన రహదారిపై బుధవారం రాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Banswada Road Accident | కొత్తబాది వైపు వెళ్తుండగా..

బాన్సువాడ (Banswada) వైపు నుంచి కొత్తబాది వైపు బైక్​పై వెళ్తున్న కొత్తబాది గిర్ని తండాకు చెందిన పాల్యా రాజు (28) మొగలాన్‌పల్లి గ్రామ శివారులోని ఎన్​హెచ్ -765డీ జాతీయ రహదారిపై ఆగి ఉన్న ట్రాక్టర్‌ను వేగంగా ఢీకొట్టాడు. ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. రాజు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవారని, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. సమాచారం అందుకున్న బాన్సువాడ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. రోడ్డు పక్కన ఎలాంటి లైట్లు లేకుండా ట్రాక్టర్ నిలిపి ఉంచడం వల్ల ప్రమాదం జరిగిందా, లేక ద్విచక్ర వాహనం అతివేగమే ప్రమాదానికి కారణమా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Government Junior College | కాలేజీలో గదుల కొరత.. రెండు విడతల్లో క్లాస్​లకు నిర్ణయం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *