అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Traffic Control Measures | హైదరాబాద్ (Hyderabad) నగరంలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించి, రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రణాళికను సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు (CS Sanjay Jaju) అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో సీనియర్ అధికారులతో ఆయన ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు భద్రత అంశాలపై సమీక్ష నిర్వహించారు.
రోడ్డు భద్రత, ట్రాఫిక్ సిగ్నళ్ల నిర్వహణ, ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించడం, అత్యవసర సేవలకు వేగవంతమైన మార్గాలను ఏర్పాటు చేయడం వంటి పలు అంశాలపై సీఎస్ చర్చించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థను బలోపేతం చేయాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.
Traffic Control Measures | ఆక్రమణలు తొలగించాలి
ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలను నివారించడానికి కఠిన చర్యలు తీసుకోవాలని సీఎస్ స్పష్టం చేవారు. రాష్ట్రవ్యాప్తంగా ట్రాఫిక్ నిర్వహణను మరింత సమర్థవంతంగా మార్చేందుకు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించేందుకు ప్రణాళికను రూపొందించాలని ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారాలను గుర్తించేందుకు, డేటా ఆధారిత, సాంకేతికతతో కూడిన పరిష్కారాలను అవలంబించాలన్నారు. డీజీపీ సి.వి. ఆనంద్, రవాణా, రహదారులు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, రవాణా కమిషనర్ ఇళంబర్తి, మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ పాల్గొన్నారు.
దీనిని కూడా చదవండి : ACB Raids | భూగర్భ, గనుల శాఖ ఏడీ అక్రమాస్తులు మాములుగా లేవుగా..