అక్షరటుడే, డిచ్పల్లి: Rusty Spotted Cat | అడవుల్లో అరుదుగా కనిపించే పిల్లిజాతి జంతువు రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఈ ఘటన జిల్లాలోని (Nizamabad) సిరికొండ రేంజ్ పరిధిలోని హుస్సేన్ నగర్ బీట్ కంపార్ట్మెంట్ వద్ద చోటు చేసుకుంది.
Rusty Spotted Cat | ఆర్మూర్ డివిజన్ పరిధిలో..
అటవీశాఖ అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం.. ఆర్మూర్ అటవీ డివిజన్ పరిధిలోని, సిరికొండ రేంజ్లో హుస్సేన్ నగర్ బీట్ కంపార్ట్మెంట్ నం.408లో రోడ్డు ప్రక్కన బొడ్డు మామిడి చెరువు ప్రాంతంలో ఒక పిల్లి జాతి జంతువు మృతి చెందినదని సమాచారం అందింది. వెంటనే స్పందించిన అధికారులు ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. అది రస్టీ స్పాటెడ్ క్యాట్ (Rusty spotted cat) తుప్పు రంగు మచ్చల పిల్లి అని నిర్ధారించారు. ఈ జంతువు వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం షెడ్యూలు-1కు చెందినదని.. చాలా అరుదైనదిగా వారు గుర్తించారు. సిరికొండ అటవీ క్షేత్రాధికారి దీనిని అడవి జంతువు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ.. అటవీప్రాంతంలో వాహనాలు నడిపే సమయంలో గంటకు 30 కిమీలకు మించని వేగంతో ప్రయాణించాలని కోరారు.
ఇది కూడా చదవండి: తమ్ముడికి చివరిసారిగా రాఖీ కట్టి కన్నీటి వీడ్కోలు