NEET PG Student Suicide | తీవ్ర విషాదం.. నీట్ పీజీ విద్యార్థిని ఆత్మహత్య

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: NEET PG Student Suicide | హైదరాబాద్ మహా నగరంలో నీట్ పీజీకి సిద్ధమవుతున్న ఓ ఎంబీబీఎస్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. హైదరాబాద్ ఆర్‌టీసీ క్రాస్‌రోడ్స్‌లోని అపరాజిత హాస్టల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

కర్నూలుకు చెందిన యశ్విత గత ఆరు నెలలుగా హైదరాబాద్‌లో ఉంటూ నీట్ పీజీ ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. పరీక్షకు ఒక్కరోజు ముందు తీవ్ర ఒత్తిడికి లోనైన ఆమె విషపదార్థం తీసుకున్నట్లు తెలుస్తోంది. విషయం గుర్తించిన వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు దక్కలేదు.

NEET PG Student Suicide | పోలీసుల దర్యాప్తు

యశ్విత కర్నూలుకు చెందిన ప్రముఖ వ్యాపారి రామ్మోహన్‌రెడ్డి ఏకైక కుమార్తెగా సమాచారం. ఉన్నత విద్యను అభ్యసిస్తూ వైద్య రంగంలో ముందుకు సాగాల్సిన యువతి ఇలా మృత్యువాత పడటం కుటుంబ సభ్యులు, స్నేహితులను తీవ్ర విషాదంలోకి నెట్టింది.

Hyderabad MMTS AC Coaches | ఎంఎంటీఎస్‌ ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. త్వరలో లోకల్‌ రైళ్లలో ఏసీ ప్రయాణం!

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విద్యార్థిని ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు, పరీక్ష ఒత్తిడి ఎంతవరకు కారణమన్న అంశంపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *