అక్షరటుడే, వెబ్‌డెస్క్: KNRUHS Fee Hike | తెలంగాణ Telangana లోని మెడికల్ Medical, డెంటల్ Dental కాలేజీల్లో ప్రవేశాలు పొందబోతున్న విద్యార్థుల విషయంలో కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (KNRUHS) కీలక నిర్ణయం తీసుకుంది.
2026–27 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ MBBS, బీడీఎస్BDS, పీజీ కోర్సుల్లో అడ్మిషన్ సమయంలో చెల్లించాల్సిన యూనివర్సిటీ ఫీజులను భారీగా పెంచింది. ఈ మేరకు కొత్త ఫీజులపై శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది.
వర్సిటీ 20వ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఫీజులను సవరించినట్లు రిజిస్ట్రార్ వెల్లడించారు. 2021–22 విద్యా సంవత్సరంలో చివరిసారిగా ఫీజులను పెంచిన వర్సిటీ.. సుమారు ఐదేళ్ల తర్వాత తాజాగా మరోసారి భారీగా పెంచడం విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళనకు కారణమవుతోంది.
KNRUHS Fee Hike | మేనేజ్‌మెంట్ కోటా విద్యార్థులపై అధిక భారం
కొత్త ఫీజుల ప్రభావం ముఖ్యంగా మేనేజ్‌మెంట్ కోటా కింద ప్రవేశాలు పొందే విద్యార్థులపై ఎక్కువగా ఉండనుంది. ఎంబీబీఎస్ ‘బీ’ కేటగిరీ కింద గతంలో రూ.40 వేలుగా ఉన్న యూనివర్సిటీ ఫీజును ఇప్పుడు రూ.1 లక్షకు పెంచారు.
అదే సమయంలో ఎన్‌ఆర్‌ఐ కోటా, ‘సీ’ కేటగిరీ కింద ప్రవేశం పొందే విద్యార్థులకు ఫీజును గతంలో ఉన్న రూ.70 వేల నుంచి రూ.2 లక్షలకు పెంచారు. అంటే ఈ కేటగిరీలో ఫీజు గణనీయంగా పెరిగింది.
Harish Rao Ponguleti Criticism | పొంగులేటి కాదు.. పొంగులూటీ : హరీశ్‌రావు ఘాటు వ్యాఖ్యలు
KNRUHS Fee Hike | బీడీఎస్ ఫీజులూ రెట్టింపు
డెంటల్ కోర్సు బీడీఎస్‌లోనూ యూనివర్సిటీ ఫీజులను రెండింతలు చేసింది. ‘బీ’ కేటగిరీ విద్యార్థులకు గతంలో రూ.20 వేలుగా ఉన్న ఫీజు ఇప్పుడు రూ.40 వేలకు చేరింది. ‘సీ’ కేటగిరీ విద్యార్థులకు రూ.40 వేలుగా ఉన్న ఫీజును రూ.80 వేలకు పెంచారు. కాంపిటెంట్ అథారిటీ కోటా కింద పీజీ ఎండీఎస్ కోర్సులో ప్రవేశం పొందే విద్యార్థులకు యూనివర్సిటీ ఫీజును రూ.35 వేలుగా నిర్ణయించారు.
KNRUHS Fee Hike | అడ్మిషన్ సమయంలోనే వన్‌టైమ్ చెల్లింపు
కాలేజీలకు చెల్లించే ట్యూషన్ ఫీజుతో ఈ యూనివర్సిటీ ఫీజుకు సంబంధం లేదు. యూనివర్సిటీ రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, ఇతర పరిపాలనా ప్రక్రియలకు సంబంధించిన ఖర్చుల కోసం అడ్మిషన్ సమయంలో ఈ మొత్తాన్ని వన్‌టైమ్ పేమెంట్‌గా చెల్లించాల్సి ఉంటుంది.
తాజా నిర్ణయంతో కౌన్సెలింగ్‌లో సీటు పొందిన అభ్యర్థులు అడ్మిషన్ లెటర్ పొందే ముందే సవరించిన యూనివర్సిటీ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఇప్పటికే విద్యా ఖర్చుల భారాన్ని ఎదుర్కొంటున్న విద్యార్థులు, వారి కుటుంబాలపై అదనపు ఆర్థిక భారం పడనుంది.
యూనివర్సిటీ ఫీజుల్లో ఇంత భారీగా మార్పులు చేయడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త ఫీజుల అమలుతో 2026–27 ప్రవేశాల్లో విద్యార్థులపై పడే అదనపు భారం ఎంత ఉంటుందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.