Mirza Rahmat Baig | నేను రాజీనామా చేయను : ఎమ్మెల్సీ మీర్జా బేగ్

తాను ఏ తప్పు చేయలేదని, పదవికి రాజీనామా చేయనని ఎమ్మెల్సీ మీర్జా రహమత్‌ బేగ్​ అన్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mirza Rahmat Baig |  ఎంఐఎం (MIM) బహిష్కృత నేత, ఎమ్మెల్సీ మీర్జా రహమత్‌ బేగ్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఏ తప్పు చేయలేదని, పదవికి రాజీనామా చేయనని తెలిపారు.

మీర్జా రహమత్​ బేగ్​ను పార్టీ అధినేత అసదుద్దీన్​ ఒవైసీ (Asaduddin Owaisi) సస్పెండ్​ చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ ఓ బాలికతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో కొంతమంది యువకులు ఆయనను పట్టుకొని కొట్టినట్లు వీడియోలు వైరల్​ అయ్యాయి. ఈ క్రమంలో పార్టీ అధినేత ఎమ్మెల్సీపై చర్యలు తీసుకున్నారు. పార్టీ నుంచి సస్పెండ్​ చేయడంతో పాటు పదవికి సైతం రాజీనామా చేయాలని ఆదేశించారు.

Mirza Rahmat Baig | ఏ తప్పు చేయలేదు

సస్పెన్షన్​పై ఎమ్మెల్సీ మీర్జా రహమత్‌ బేగ్‌ స్పందించారు. తాను ఏ తప్పు చేయలేదని, రాజీనామా చేయనని పేర్కొన్నారు. తనపై వస్తున్న వార్తలు అవాస్తవం అని కొట్టి పారేశారు. తన పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా..డీప్‌ఫేక్ వీడియోలను ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయమై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు. పార్టీ అధినేత అసదుద్దీన్​ ఒవైసీ తనకు న్యాయం చేస్తారనే నమ్మకం ఉందన్నారు. తాను ఎక్కడికి పారిపోలేదని ఆయన చెప్పారు. కుటుంబంతో కలిసి ఉమ్రయాత్రలో ఉన్నట్లు తెలిపారు.

దీనిని కూడా చదవండి : Weather Update | రాష్ట్రానికి మోస్తరు వర్ష సూచన

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *