అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Popular Channel reunion | నగరంలోని (Nizamabad ) పాపులర్ ఛానల్లో పనిచేసిన యజమాన్యం.. నెట్వర్క్ బృందం సభ్యులు 25ఏళ్ల తర్వాత ఒక్కచోట కలిశారు. జిల్లా కేంద్రం ఈ ఆత్మీయ సమ్మేళనానికి (media reunion) వేదికైంది.
Popular Channel reunion | 30ఏళ్ల క్రితం పాపులర్ ఛానల్..
పాపులర్ ఛానల్ గత 30 ఏళ్ల క్రితం కేంద్రంలో ఏర్పాటైంది. అప్పట్లో ఛానల్ పేరులాగే చాలా పాపులర్ అయ్యింది. ఈ సందర్భంగా 25ఏళ్ల తర్వాత ఛానల్ యాజమాన్యం, సిబ్బంది ఒక్కచోట కలిసి ఆనందంగా గడిపారు. యజమాన్యంతో పాటు ఇక్కడ పని చేసిన సిబ్బంది వారి కుటుంబ సభ్యులు పిల్లలతో సహా ఇక్కడికి వచ్చి వారి అనుభూతిని పంచుకున్నారు. ఇప్పటివరకు ఎస్సెస్సీ, ఇంటర్, డిగ్రీ బ్యాచ్ విద్యార్థులు మాత్రమే ఆత్మీయ సమ్మేళనాలు జరుపుకున్నారని.. అయితే వినూత్నంగా ఓ ఛానల్ బృందం ఒక్క చోట కలిసి సందడి చేయడం ఆనందంగా ఉందని బృందం సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పాపులర్ ఛానల్ ఎండీ మీసాలా సుధాకర్ మాట్లాడుతూ సిబ్బంది ఇన్నేళ్ల తర్వాత ఒక్కచోట కలవడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాపులర్ టెక్నీషియన్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Sajjala Comments | అటెన్షన్ కోసమే విజయ సాయిరెడ్డి ఆరోపణలు : సజ్జల