West Asia Tensions | పశ్చిమాసియాలో పెరిగిన ఉద్రిక్తతలు.. నష్టాల్లో సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ సోమవారం నష్టాలతో ప్రారంభమైంది. ఉదయం 11.50 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 376 పాయింట్లు, నిఫ్టీ 141 పాయింట్ల నష్టంతో ఉన్నాయి.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : West Asia Tensions | అమెరికా, ఇరాన్‌ల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. పరస్పర దాడులతో క్రూడ్ ఆయిల్ (Crude oil) ధరకు రెక్కలొచ్చాయి. గత సెషన్‌లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ. 5 వేల కోట్లకుపైనే పెట్టుబడులు ఉపసంహరించడం, గ్లోబల్ మార్కెట్లు నెగెటివ్‌గా ఉండడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ నష్టాలతో సాగుతున్నాయి.

West Asia Tensions | ఫెడ్ వడ్డీ రేట్ల పెంపుపై ఆందోళనలు..

సెప్టెంబర్‌లో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచే అవకాశాలున్నాయన్న సంకేతాలు మార్కెట్ ను ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీంతో యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్ పెరిగి, డాలర్ విలువ పుంజుకుంది. దీంతో ఈక్విటీ మార్కెట్లలో సెంటిమెంట్ ప్రతికూలంగా మారింది.

West Asia Tensions | నష్టాలతో ప్రారంభమై..

దేశీయ స్టాక్ మార్కెట్ సోమవారం నష్టాలతో ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 134 పాయింట్ల నష్టంతో ప్రారంభమై 47 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి 426 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ 58 పాయింట్ల గ్యాప్ డౌన్ తో ప్రారంభమై 11 పాయింట్లు పెరిగింది. తిరిగి 135 పాయింట్లు నష్టపోయింది. ఉదయం 11.50 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 376 పాయింట్ల నష్టంతో 76,888 వద్ద, నిఫ్టీ 141 పాయింట్ల నష్టంతో 24,034 వద్ద ఉన్నాయి.

Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 3 స్టాక్స్ లాభాలతో, 27 స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 0.56 శాతం, ఎయిర్‌టెల్ 0.40 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 0.12 శాతం లాభాలతో ఉన్నాయి.

Top losers : టాటా స్టీల్ 2.47 శాతం, ఇండిగో 2.02 శాతం, ఇన్ఫోసిస్ 2.01 శాతం, ఎన్టీపీసీ 2.01 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.68 శాతం నష్టాలతో ఉన్నాయి.

ఇది కూడా చదవండి..: eSDS Software IPO | పబ్లిక్ ఇష్యూకు సాఫ్ట్‌వేర్ సొల్యూషన్ కంపెనీ.. జీఎంపీ 83 శాతం పైనే..

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *