నిజామాబాద్Seethakka Kamareddy tour | నేడు కామారెడ్డిలో మంత్రి సీతక్క పర్యటన

Seethakka Kamareddy tour | నేడు కామారెడ్డిలో మంత్రి సీతక్క పర్యటన

రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క నేడు కామారెడ్డి పట్టణానికి రానున్నారు. ఈ మేరకు మంత్రి పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ అధికారులు ఖరారు చేశారు

అక్షరటుడే, కామారెడ్డి: Seethakka Kamareddy tour | రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క (Minister Seethakka) నేడు కామారెడ్డి పట్టణానికి రానున్నారు. ఈ మేరకు మంత్రి పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ అధికారులు ఖరారు చేశారు.

మధ్యాహ్నం 12:30 గంటలకు హైదరాబాద్ (Hyderabad) నుంచి మంత్రి సీతక్క బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 2:30 గంటలకు కామారెడ్డికి చేరుకుని జిల్లా పోలీసు కార్యాలయ సమీపంలో గల సఖి కేంద్రాన్ని మంత్రి ప్రారంభించనున్నారు.

Seethakka Kamareddy tour | అధికారులతో సమీక్ష

కలెక్టరేట్ కార్యాలయం (Collectorate Office)లో మధ్యాహ్నం మూడు గంటలకు అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. వికలాంగులకు సహాయ పరికరాలను పంపిణీ చేయనున్నారు. 64 రిట్రోఫీటెడ్ స్కూటీలు, 8 బ్యాటరీ వీల్ ఛైర్స్, 3 మొబైల్ బిజినెస్ బ్యాటరీ ట్రై సైకిల్స్, 2 మినీ ట్రేడింగ్ ఆటోలు, 2 హైబ్రిడ్ అటాచ్మెంట్ వీల్ ఛైర్స్ పంపిణీ చేయనున్నారు.

Seethakka Kamareddy tour | పిల్లలకు స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ

పట్టణంలోని సాయంత్రం 5 గంటలకు కళాభారతి ఆడిటోరియం (Kalabharathi Auditorium)లో నిర్వహించే అవగాహన సమావేశానికి హాజరుకానున్నారు. బాల సంరక్షణ పిల్లలకు స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఇందిరమ్మ గృహ నిర్మాణాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులతో భోజనం చేయనున్నారు. రాత్రి 8:30 గంటలకు నిజామాబాద్​కు బయలుదేరనున్నారు.

ఇది కూడా చదవండి..: Farmer Power Services | రైతులకు మెరుగైన సేవలందించేందుకు ప్రత్యేక వాహనాలు: ట్రాన్స్​కో ఎస్​ఈ

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...

Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sridip Success Story | పరీక్ష హాలులో ప్రశ్నపత్రాన్ని...

SRH Powerplay Score | SRH ఊచకోత.. MI బౌలర్లపై విరుచుకుపడ్డ ఓపెనర్లు.. పవర్‌ప్లేలోనే మ్యాచ్ మలుపు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SRH Powerplay Score | ఐపీఎల్‌లో మరోసారి రన్‌ఫెస్ట్‌కు...

Pallikonda Theft Case | పల్లికొండలో దొంగల హల్​చల్​.. ఐదు తులాల బంగారం దోపిడీ..

అక్షరటుడే, భీమ్​గల్: Pallikonda Theft Case | దొంగలు హల్​చల్​ చేశారు....