అక్షరటుడే, కామారెడ్డి: Smart Ration Cards | స్మార్ట్ రేషన్ కార్డులు ప్రతి కుటుంబానికి అందేలా చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి అన్నారు. సోమవారం (Kamareddy) మున్సిపల్ పరిధిలోని 13వ వార్డులో వనమహోత్సవం, స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. మొక్కలు నాటి వనమహోత్సవాన్ని ప్రారంభించారు. అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.
Smart Ration Cards | పర్యావరణాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత
ఆమె మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. పచ్చదనం పెంపొందించడం, పర్యావరణాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఈ హన్మంతరావు, కౌన్సిలర్లు లలిత చిట్టిబాబు, అంజాద్, వాజీద్, బబ్లు, జావీద్, సిద్దిక్, సత్యం, భాస్కర్ గౌడ్, మున్సిపల్ అధికారులు అక్తర్, వార్డు ఆఫీసర్ వినయ్ పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Nizamabad Police Promotions | పలువురు హెడ్కానిస్టేబుళ్లకు పదోన్నతులు.. అభినందించిన సీపీ