ఆంధ్రప్రదేశ్​Google AI Data Center | గూగుల్‌ ఏఐ డేటా సెంటర్‌కు శంకుస్థాపన

Google AI Data Center | గూగుల్‌ ఏఐ డేటా సెంటర్‌కు శంకుస్థాపన

గూగుల్ డేటా సెంటర్, ఏఐ హబ్‌కు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో కలిసి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Google AI Data Center | ప్రముఖ ఐటీ సంస్థ గూగుల్​ ఏపీలోని విశాఖ పట్నం (Visakhapatnam)లో ఏర్పాటు చేయనున్న అతిపెద్ద మెగా డేటా సెంటర్, ఏఐ హబ్‌కు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ (Union Minister Ashwini Vaishnaw)తో కలిసి సీఎం చంద్రబాబు (CM Chandrababu) మంగళవారం శంకుస్థాపన చేశారు. విశాఖ జిల్లా తర్లువాడలో భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు.

విశాఖను డేటా సెంటర్​ హబ్​గా మారుస్తామని గతంలో సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు గూగుల్ డేటా సెంటర్‌ (Google Data Center) కోసం విశాఖలోని 3 ప్రాంతాల్లో భూమి కేటాయించారు. సుమారు రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్​ నిర్మాణానికి గూగుల్​ ముందుకు వచ్చింది. విశాఖ, అనకాపల్లి జిల్లాల పరిధిలో గిగావాట్‌కు పైగా సామర్థ్యంతో మూడు చోట్ల డేటాసెంటర్లు నిర్మించనుంది.

Google AI Data Center | 600 ఎకరాల్లో..

తర్లువాడ, రాంబిల్లి, అడవివరం ప్రాంతాల్లో డేటా సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం 600 ఎకరాల భూమి కేటాయించింది. దీని కోసం 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని, మంత్రి లోకేష్, గూగుల్ ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Vizianagaram Road Accident : పాదచారులపైకి దూసుకెళ్లి..లారీని ఢీకొట్టి.. విజయనగరంలో కారు బీభత్సం.. నలుగురి దుర్మరణం.. ఇద్దరికి తీవ్ర గాయాలు

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...

Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sridip Success Story | పరీక్ష హాలులో ప్రశ్నపత్రాన్ని...

SRH Powerplay Score | SRH ఊచకోత.. MI బౌలర్లపై విరుచుకుపడ్డ ఓపెనర్లు.. పవర్‌ప్లేలోనే మ్యాచ్ మలుపు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SRH Powerplay Score | ఐపీఎల్‌లో మరోసారి రన్‌ఫెస్ట్‌కు...

Pallikonda Theft Case | పల్లికొండలో దొంగల హల్​చల్​.. ఐదు తులాల బంగారం దోపిడీ..

అక్షరటుడే, భీమ్​గల్: Pallikonda Theft Case | దొంగలు హల్​చల్​ చేశారు....