Errapati Srinu | ​పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడిగా ఎర్రపాటి శ్రీను ఎన్నిక

నిజామాబాద్ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడిగా ఎర్రపాటి శ్రీను ఎన్నికయ్యారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ:  Errapati Srinu | నిజామాబాద్ పోలీసు (Nizamabad Police) అధికారుల సంఘం అధ్యక్షుడిగా ఎర్రపాటి శ్రీను ఎన్నికయ్యారు. అసోసియేషన్​కు సంబంధించిన ఎన్నికలు నగరంలోని సీపీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్​ హాల్​లో నిర్వహించారు.

సమస్యల పరిష్కారానికి కృషి

నిజామాబాద్​ పోలీస్​ కమిషనరేట్​ పరిధిలోని పోలీసు సంఘంలో మొత్తంగా 40మంది సభ్యులు ఉన్నారు. వీరి మధ్య ఎన్నిక నిర్వహించగా.. అధ్యక్షుడిగా ఎర్రపాటి శ్రీను ఎన్నికయ్యారు. అనంతరం పూర్తి కార్యవర్గాన్ని ఎన్నుకోనున్నారు. ఈ సందర్భంగా శీను మాట్లాడుతూ.. పోలీసుల సమస్యల పరిష్కారానికి సంఘం తరపున కృషి చేస్తామన్నారు. ఉన్నతాధికారుల మద్దతుతో ముందుకు వెళ్తామన్నారు.

ఇది కూడా చదవండి..: Boys Observation Home | విద్యార్థులకు సరైన భోజన వసతి కల్పించాలి..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *