Kalyana Lakshmi Schemes | కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలపై కీలక తీర్పు.. మధ్యంతర స్టే ఎత్తివేసిన హైకోర్టు

తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ల అమలుపై హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Kalyana Lakshmi Schemes | తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ల అమలుపై హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ పథకాల అమలుపై సింగిల్ బెంచ్ గతంలో విధించిన మధ్యంతర స్టేను హైకోర్టు (  High Court)డివిజన్‌ బెంచ్ ఎత్తివేసింది. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఈ అప్పీల్‌పై విచారణ చేపట్టింది.

Kalyana Lakshmi Schemes | ఆర్థిక సాయం..

పేద కుటుంబాల యువతుల వివాహాలకు ఈ పథకాల ద్వారా ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. అయితే, ఈ పథకాల అమలుకు సంబంధించిన కొన్ని జీవోలపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన సింగిల్ బెంచ్ గతంలో మధ్యంతర స్టే ఇచ్చింది. దీంతో పథకాల అమలుపై అనిశ్చితి నెలకొనగా, ప్రభుత్వం డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించింది.

Kalyana Lakshmi Schemes | ప్రభుత్వం తరఫున వాదనలు..

ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ.. ఈ పథకాలు పేద యువతులకు సామాజికంగా, ఆర్థికంగా ఎంతో తోడ్పడుతున్నాయని తెలిపారు. సింగిల్ బెంచ్ ఉత్తర్వుల వల్ల వేలాది మంది లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ పిటిషన్‌కు ప్రజా ప్రయోజనం లేదని, దాన్ని కొట్టివేయాలని కోరారు. విచారణ సందర్భంగా, ఈ పథకాలపై కాగ్ (CAG) నివేదికలో ఏమైనా అభ్యంతరం వ్యక్తం చేశారా అని ధర్మాసనం ప్రశ్నించింది. కాగ్ నివేదికలో ఎలాంటి అంశం లేనప్పుడు అమలును ఎందుకు నిలిపివేయాలని కోర్టు వ్యాఖ్యానించింది.

ఇది కూడా చదవండి:  Subhash Chandra Insolvency | జీ మీడియా అధినేత సుభాష్​ చంద్రకు షాక్​..

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *