అక్షరటుడే వెబ్డెస్క్: Brishti Mukherjee Suicide | పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె సోదరుడు నిహార్ ముఖర్జీ కుమార్తె బ్రిష్టి ముఖర్జీ (28) బలవన్మరణానికి పాల్పడ్డారు. బీర్భూమి జిల్లా రాంపూర్హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుసుంబా గ్రామంలోని తన నివాసంలో ఆమె మంగళవారం ఉదయం ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Brishti Mukherjee Suicide | వృత్తిపరమైన ఇబ్బందులు ..
ఉపాధ్యాయుల నియామక ప్రక్రియలో అక్రమంగా ఉద్యోగం పొందారనే ఆరోపణలతో విచారణ అనంతరం ఆమె ఉద్యోగాన్ని కోల్పోయారు. అప్పటి నుంచి ఆమె మానసిక ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆమెకు సంబంధించిన విడాకుల కేసు కూడా కోర్టులో విచారణలో ఉంది. ఈ వ్యక్తిగత, వృత్తిపరమైన ఇబ్బందుల కారణంగానే ఆమె తీవ్ర మనోవేదనకు గురై ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఘటనాస్థలిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని, పోస్టుమార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని పోలీసులు వెల్లడించారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
Brishti Mukherjee Suicideకొద్ది రోజుల వ్యవధిలోనే మరో ఘటన..
రాంపూర్హాట్లోనే తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ ఆశిష్ బెనర్జీ ఆదివారం పార్టీ కార్యాలయంలో ఉరివేసుకుని మృతి చెందిన ఘటన రాష్ట్రంలో కలకలం రేపింది. ఐదుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన, తనపై వస్తున్న అవినీతి ఆరోపణలను ఖండిస్తూ సూసైడ్ నోట్ వదిలిన విషయం తెలిసిందే. ఆ ఘటన జరిగిన కొద్ది రోజులకే మమతా బెనర్జీ కుటుంబంలోనూ ఇలాంటి విషాదం చోటుచేసుకోవడం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
మమతా బెనర్జీ బంధువు దృష్టి ముఖర్జీ ఆత్మహత్య
పశ్చిమ బెంగాల్ రాంపూర్హాట్లో ఘటన
ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన దృష్టి ముఖర్జీ
పాఠశాల ఉపాధ్యాయ నియామకాల కుంభకోణంలో ఉద్యోగం కోల్పోయిన దృష్టి
గత కొద్దిరోజులుగా డిప్రెషన్, వ్యక్తిగత సమస్యలతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యుల… pic.twitter.com/VlI6rTK7o6
— RTV (@RTVnewsnetwork) September 1, 2026
ఇది కూడా చదవండి: Student Protest FIRs | నిరసనకారులపై కేసులు కొట్టేసిన సుప్రీంకోర్టు.. ఆందోళన విరమించిన సీజేపీ