Dichpally Battalion | డిచ్​పల్లి బెటాలియన్‌ కమాండెంట్‌గా సీతారాం బాధ్యతల స్వీకరణ

డిచ్​పల్లి ఏడో బెటాలియన్‌ నూతన కమాండెంట్‌గా బి. సీతారాం బాధ్యతలు స్వీకరించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, డిచ్​పల్లి: Dichpally Battalion | డిచ్​పల్లి (Dichpally) ఏడో బెటాలియన్‌ నూతన కమాండెంట్‌గా బి. సీతారాం మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. బెటాలియన్ అధికారులు, సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.

బెటాలియన్​లో క్రమశిక్షణ..

బెటాలియన్ క్రమశిక్షణ, విధి నిర్వహణలో నిబద్ధత, ప్రజలకు మెరుగైన సేవలందించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని కమాండెంట్ సీతారాం పేర్కొన్నారు. సంక్షేమంతో పాటు సంస్థ ప్రతిష్టను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం సిబ్బందితో ఆయన సమావేశమయ్యారు. బెటాలియన్​ క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తోందని.. దీనిని మరింత పెంచేందుకు కృషి చేద్దామని పేర్కొన్నారు.

pally

ఇది కూడా చదవండి: Honda త్వరలో మార్కెట్లోకి కొత్త ఈవీ + స్కూటర్..! 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *