అక్షరటుడే, వెబ్‌డెస్క్ : SI Caught by ACB | లంచం తీసుకుంటూ ఓ ఎస్సై ఏసీబీ (ACB) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికాడు. ఒక వ్యక్తిపై కేసు నమోదు కాకుండా ఆపడం, కుటుంబ వివాదాన్ని పరిష్కరించడం, పాస్‌పోర్ట్ జప్తు కాకుండా చూడటం కోసం టోలీచౌకి ఎస్సై (Tolichowki SI) ఆర్ పాండు నాయక్ రూ.10 వేల లంచం డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో అవినీతి అధికారులు రెచ్చిపోతున్నారు. పోలీస్ శాఖలో సైతం పలువురు భారీగా లంచాలు తీసుకుంటున్నారు. ఇటీవల ఏసీబీ దాడుల్లో పలువురు పోలీసులు చిక్కుతుండటం ఇందుకు నిదర్శనం. తాజాగా గోల్కొండ జోన్ పరిధిలోని టోలీచౌకీ పోలీస్ స్టేషన్ సబ్-ఇన్స్పెక్టర్ (SI) ఆర్. పాండు నాయక్‌ను ఓ కుటుంబ వివాదం పరిష్కరించడానికి లంచం డిమాండ్ చేశాడు. కేసు నమోదు చేయకపోవడం, కుటుంబ వివాదాన్ని పరిష్కరించడంలో సహాయపడటం, పాస్‌పోర్ట్‌ను తిరిగి ఇవ్వడం వంటి పనుల కోసం ఆయన లంచం అడిగారు.
SI Caught by ACB | తల్లి ఫిర్యాదు మేరకు..
ఎస్సై లంచం అడగడంతో బాధితుడి తల్లి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈ మేరకు ఎస్సై పాండు నాయక్ లంచం తీసుకుంటుండగా మంగళవారం ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్లో సోదాలు చేశారు. ఎస్సైని అరెస్ట్ అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని జ్యుడీషియల్ రిమాండ్ కోసం నాంపల్లిలోని ACB కేసుల ప్రత్యేక న్యాయస్థానం ముందు అతన్ని హాజరు పరుస్తామని తెలిపారు. ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే తమకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
దీనిని కూడా చదవండి : Konda Surekha | కొండా సురేఖపై చర్యలుంటాయా.. ఢిల్లీలో సీఎం బిజీ