Revanth Reddy 1000 Days | వెయ్యి రోజుల పాలనపై సీఎం రేవంత్ రెడ్డి భావోద్వేగ సందేశం

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనను విజయవంతంగా పూర్తి చేసుకుంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Revanth Reddy 1000 Days | తెలంగాణలో  ( Telangana )కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా ప్రజలకు ఒక భావోద్వేగపూరిత సందేశాన్ని పంపారు. ప్రజల ఆకాంక్షలు, అమరుల త్యాగాల ఆశయాలే తమ ప్రభుత్వానికి ఇంధనంగా నిలిచాయని ఆయన పేర్కొన్నారు. పేదల అవసరాలు, వారి ఆత్మగౌరవాన్ని గౌరవిస్తూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు.

Revanth Reddy 1000 Days | సామాజిక న్యాయమే లక్ష్యం..

రాష్ట్ర భవిష్యత్తును, యువత ఉపాధి అవకాశాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నట్లు సీఎం వివరించారు. సకల వర్గాలకు సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పిస్తూ పాలన అందిస్తున్నామని చెప్పారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆశీస్సులు, లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తల సహకారంతో రాష్ట్రాన్ని విశ్వ వేదికపై అగ్రస్థానంలో నిలిపే వరకు ఈ కృషిని నిరంతరం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రయాణంలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపిన సీఎం.. ప్రజలతో ఉన్న ఈ అనుబంధం తన గుండెల్లో ఎప్పటికీ శాశ్వతంగా నిలిచి ఉంటుందని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి:  KTR Congress Criticism | అసమర్థత ప్రోమాక్స్​.. అవినీతి అల్ట్రామాక్స్​.. కాంగ్రెస్​ పాలనపై కేటీఆర్​ సెటైర్లు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *