Asaduddin Owaisi | రేవంత్ దూకుడును కంట్రోల్ చేయాలని కేసీఆర్‌కు ముందే చెప్పా: అసదుద్దీన్ ఒవైసీ

తాను సీఎం రేవంత్ రెడ్డికి మద్దతు ఇస్తున్నానని, అయితే కాంగ్రెస్ పార్టీకి కాదని స్పష్టం చేశారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Asaduddin Owaisi | తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూకుడును నియంత్రించాలని తాను గతంలోనే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సూచించానని తెలిపారు. రేవంత్ రెడ్డి దూకుడును కంట్రోల్ చేయకపోతే బీఆర్ఎస్ నేతలంతా ఇంటికే పరిమితం కావాల్సి వస్తుందని అప్పుడే హెచ్చరించానని పేర్కొన్నారు.

 Asaduddin Owaisi | రేవంత్​కు పిలుపు..

అయితే తన సూచనలను వారు పట్టించుకోలేదని, చివరకు తాను చెప్పినట్లుగానే బీఆర్ఎస్ BRS నేతలు ఇంటికే పరిమితమయ్యారని ఒవైసీ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డిలో గతంతో పోలిస్తే దూకుడు కొంత తగ్గిందని, మళ్లీ ప్రజల్లోకి రావాలని సూచించారు. ప్రజలు ఆదరిస్తారని ఆయన అన్నారు.

Konda Murali Remarks | మాకు ఇదేం కొత్త కాదు.. ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే ఎవరూ తట్టుకోలేరు : కొండా మురళి

 Asaduddin Owaisi | రేవంత్‌కు మద్దతు.. కాంగ్రెస్‌కు కాదు

ఇదే సమయంలో కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి కూడా అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను సీఎం రేవంత్ రెడ్డికి మద్దతు ఇస్తున్నానని, అయితే కాంగ్రెస్ పార్టీకి కాదని స్పష్టం చేశారు.

రేవంత్ రెడ్డి పాలనలో హైదరాబాద్‌తో పాటు తెలంగాణ అభివృద్ధి చెందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రేవంత్ రెడ్డి తనదైన శైలిలో పాలన సాగించాలని సూచించారు. అభివృద్ధి విషయంలో తెలంగాణ దేశంలోనే ప్రత్యేకంగా నిలవాలని ఆకాంక్షించారు.

ఒవైసీ తాజా వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ఒకవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు తాను గతంలో చేసిన సూచనలను ప్రస్తావిస్తూనే.. మరోవైపు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై సానుకూలంగా స్పందించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *