అక్షరటుడే, వెబ్‌డెస్క్: ESDS Software Solutions IPO | భారతదేశంలో క్లౌడ్, మేనేజ్డ్ సర్వీసెస్, డేటా సెంటర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మరియు సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్‌ను అందించే ఏఐ సామర్థ్యం గల ఈఎస్‌డీఎస్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్ లిమిటెడ్ కంపెనీ పబ్లిక్ ఇష్యూకు వచ్చింది. ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 1 వరకు సబ్‌స్క్రిప్షన్ స్వీకరించింది. మార్కెట్ నుంచి రూ.720 కోట్లు సమీకరించింది.
ESDS Software Solutions IPO | భారీ స్పందన..
ఈఎస్‌డీఎస్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్ లిమిటెడ్ కంపెనీ ఐపీవో (IPO)కు ఇన్వెస్టర్లనుంచి భారీ స్పందన లభించింది. మొత్తం కోటా 142.88 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది. ఇందులో క్యూఐబీ కోటా 274.97 రెట్లు, ఎన్ ఐఐ కోటా 202.87 రెట్లు, రిటైల్ కోటా 41.68 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యాయి.
ESDS Software Solutions IPO | 76.46 శాతం ప్రీమియంతో లిస్టింగ్..
ఈఎస్‌డీఎస్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్ కంపెనీ షేర్లు శుక్రవారం స్టాక్ మార్కెట్‌లో లిస్టయ్యాయి. కంపెనీ ఒక్కో ఈక్విటీ షేరును రూ. 429 కి విక్రయించగా.. రూ. 328 లాభంతో రూ. 757 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. అంటే ఐపీవో అలాట్ అయినవారికి లిస్టింగ్ సమయంలోనే 76.46 శాతం లాభాలు వచ్చాయి. ఆ తర్వాత కూడా షేరు జోరు కొనసాగి రూ. 908.40 వద్ద అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. మొత్తంగా ఒక్కరోజే షేరు ధర 111.75 శాతం పెరిగింది.
ఇది కూడా చదవండి..: Stock Market Gains | లాభాల బాటలో మార్కెట్లు