అక్షరటుడే వెబ్‌డెస్క్: Sana Satish Babu | ఆంధ్రప్రదేశ్‌కు ( Andhra Pradesh )చెందిన టీడీపీ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబును పార్లమెంట్‌లోని ప్రతిష్టాత్మకమైన బిజినెస్ అడ్వైజరీ కమిటీ (Business Advisory Committee) సభ్యుడిగా రాజ్యసభ చైర్మన్ నామినేట్ చేశారు. రాజ్యసభ కమిటీల పునర్వ్యవస్థీకరణలో భాగంగా స్టాండింగ్ కమిటీల సభ్యుల నియామకం చేపట్టడం జరిగింది.
Sana Satish Babu | అత్యంత ప్రాధాన్యత..
సభా కార్యక్రమాల నిర్వహణ, చర్చకు వచ్చే అంశాల ప్రాధాన్యత, సభా సమయాన్ని కేటాయించడం వంటి కీలక పార్లమెంటరీ వ్యవహారాల్లో బిజినెస్ అడ్వైజరీ కమిటీ అత్యంత ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. ఇటువంటి కీలక కమిటీలో సానా సతీష్ బాబుకు చోటు దక్కడం ఆంధ్రప్రదేశ్‌కు లభించిన ముఖ్యమైన ప్రాతినిధ్యంగా భావిస్తున్నారు.
Sana Satish Babu | టీడీపీ శ్రేణులు హర్షం..
రాజ్యసభలో రాష్ట్రానికి సంబంధించిన అంశాలను మరింత సమర్థవంతంగా ప్రస్తావించడానికి, ప్రజా సమస్యలు , అభివృద్ధి అంశాలకు పెద్దపీట వేయడానికి ఈ బాధ్యత ఎంతగానో దోహదపడుతుందని ఆయన అనుచరులు, టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ సానా సతీష్ బాబుకు పలువురు సహచర ఎంపీలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు , కార్యకర్తలు ఘనంగా అభినందనలు తెలిపారు.
ఇది కూడా చదవండి: Gutpa Alisagar Irrigation Water | ఫలించిన సుదర్శన్ రెడ్డి, భూపతిరెడ్డి కృషి.. ఖరీఫ్‌కు నీటివిడుదల