BRS Protest | అమలు చేయని కాంగ్రెస్​ హామీలకు నిరసనగా బీఆర్​ఎస్​ వంటావార్పు..

అమలు చేయని హామీలకు నిరసనగా బీఆర్​ఎస్​ వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: BRS Protest | అమలు చేయని కాంగ్రెస్​ హామీలకు నిరసనగా బీఆర్​ఎస్​ వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. నగరంలోని (Nizamabad) ధర్నాచౌక్​లో నగర బీఆర్​ఎస్ (BRS Nizamabad) పార్టీ ఆధ్వర్యంలో రోడ్డుపైనే వంటావార్పు చేసి నిరసన చేపట్టారు.

BRS Protest | మాజీ ఎమ్మెల్యే బిగాల ఆధ్వర్యంలో..

వెయ్యి రోజుల కాంగ్రెస్​ దగా పాలనపై బీఆర్​ఎస్​ సమర భేరి మోగించిందని బీఆర్​ఎస్​ సీనియర్​ నాయకులు పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్​ గుప్తా (Bigala Ganesh Gupta) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, కేసీఆర్ కిట్‌కు ప్రత్యామ్నాయంగా హామీలు, కళ్యాణలక్ష్మి పథకంలో తులం బంగారం, మహిళలకు స్కూటీలు వంటి అనేక హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ దండు నీతు కిరణ్ శేఖర్, నగర అధ్యక్షుడు సిర్ప రాజు, నుడా మాజీ ఛైర్మన్​ ప్రభాకర్ రెడ్డి, సుజిత్ సింగ్, సత్య ప్రకాష్, గాండ్ల లింగం, నవీద్ ఇక్బాల్, జగత్ రెడ్డి, ప్యాట సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: మైక్రోసాఫ్ట్ జాబ్ వదిలేసి భారత్‌కు… ఓ యువకుడి భావోద్వేగ పోస్ట్

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *